ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Sunday, July 5

నాకేం కావాలో తెలియడం లేదు..!

ఏది కావాలో ఏది వద్దో ?
ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో ?
ఎవరు మంచివారో ఎవరు చెడ్డ వారో ?
ఏది ఎలా ఉండాలో ఏది ఎలా ఉండకూడదో ?
ఏమని చెప్పాలో ఏమని చెప్పకూడదో ?
ఏమనాలో ఏమనకూడదో ?
ఎక్కడుండాలో ఎక్కడుండకూడదో ?
ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో ?
ఎందరు నాతో వస్తారో ఎందరు రారో ?

అని భయపడితే ....జీవించడమే భారంగా తోస్తుంది
అపుడు ఇలా ఆలోచిస్తే
జీవితం  లో ఆనందం నాతోనే ఉంది 
నాకు కావలసింది నాకోసం ఉంటుంది
నా అవసరం నేనేం చెయ్యాలో నాకు చెప్తుంది
నేను మంచి వాన్నైతే అందరు మంచివాళ్ళే
ప్రపంచం లో ప్రతి వస్తువు నాకోసమే అమర్చబడి ఉంది,దాన్ని సాధించుకోవాలి
ప్రేమతో నేనేం చెప్పినా నిజమౌతుంది 
అప్పుడు ఎక్కడున్నాప్రశాంతంగా ఉంటుంది
ముందు నన్ను నేను నమ్ముతాను 
అప్పుడు అందరు కలిసి నాతో వస్తారు 
ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రేమ మయం

Saturday, June 20

ప్రేమశాతం:ఒక చిన్న పాప -ఒక నాన్న

ఒక చిన్న పాప  తన నాన్న పుట్టినరోజున తన నాన్న గారికోసం సాయంత్రం 5గంటల నుండి
చాలా చాలా  ఎదురుచూస్తోంది...
మాటి మాటి కి ఇంటి door వద్దకు వెళ్లి మల్లి లోపలకి వచ్చి clock వైపుకు చూస్తూ పచార్లు చేస్తోంది...
వాళ్ళ అమ్మ అదంతా గమనిస్తూ అబ్బో దీనికి ఏఎ రోజు కాళ్ళు ఒక చోట నిలబడడం లేదు ...
అని అనుకుంటూ తన పని తను చేసుకుంటుంది...
కాని నాన్నగారు రాలేదు...
సమయం 6 అయ్యింది..వాళ్ళ అమ్మ హోం వర్క్ చేసుకో నాన్న గారు వస్తారు లే అని చెప్పింది..
పాప ఎప్పుడు 8pmవరకు కూడా తెమలని హోం వర్క్ 6-30pm లోపే చేసేసింది...
ఇంతలో బైక్ సౌండ్ వచ్చేసింది..వెంటనే పరుగేత్తుకేల్లింది...కాని వచ్చింది మామయ్య...
వెంటనే ఎప్పుడు మామయ్య చేతుల వైపు ఆనందంగా చూసే పాప వీడెందుకు వచ్చాడురా...
ఇప్పుడు అని ఒక పేస్ పెట్టేయ్య గానే ...
మామయ్య తన చేతిలోని చాక్లెట్లుఇచ్చినా వాటిని ఎదో అల తీసుకొని bye మామయ్య అని చెప్పేసింది...
ఇంతలో వాళ్ళ అమ్మ కలుగ జేసుకొని వాళ్ళ నాన్న గారి బర్త్ డే ఈ రోజు...

అది వాళ్ళ నాన్న గారికి ఒక గిఫ్ట్ తయారు చేసింది...
అది ఇవ్వాలని తెగ ఇదయి పోతోంది...
అపుడు మామయ్య ఏది ఆ గిఫ్ట్ నేనొకసారి చూస్తాను...
అంటే noo...ఇది ముట్టకూడదు...
ఇది నాన్న గారే ఓపెన్ చేసుకోవాలి..
అమ్మా నువ్వు కూడా ఓపెన్ చెయ్యకూడదు...గిఫ్ట్ ను చూడకూడదు...అని వార్నింగ్ ఇచ్చింది...
అప్పటికే 7-30pm అయ్యింది...
ఆ గిఫ్ట్ ని అలాగే పట్టుకొని పడుకునిపొయ్యింది...
నాన్న గారు రాత్రి 9కి వచ్చారు ...
పాప పడుకొని ఉంది...
అపుడు వాళ్ళ అమ్మ ఎంటండి?పాప మీకోసం ఎంత ఎదురు చూసింది...
మీరు ఈ రోజే లేట్ గా వచ్చారు..
అదిగో ఆ గిఫ్ట్ మీకోసం తయారు చేసింది..చూడండి...అని చెప్పేసి వెళ్ళిపోయింది...
అపుడు వాళ్ళ నాన్న గారు గిఫ్ట్ చూసారు..
అది చాల beautiful బ్లూ కలర్ లో రెడ్ రిబ్బన్ తో విత్ all మై love
అని రాసి ఉన్న ఒక అందమైన డబ్బా ...
ఓపెన్ చేసి చూసాడు..
ఆశ్చర్యం అందులో ఏమి గిఫ్ట్ లేదు...
నాన్న గారికి కొంచెం అసహనం వచ్చింది..
సర్లే పోనీ అని రేపు మార్నింగ్  అడుగుదాం అనుకొని కాస్త అసహనం తో పడుకుండి పోతాడు
తెల్లవారి పాప నిద్ర నుండి  లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి గిఫ్ట్ ఓపెన్ చేసారా ?అంటుంది
అప్పుడు వాళ్ళ నాన్న ఆ గిఫ్ట్ లో ఏమి లేదు కదా? అని అడుగుతాడు
అపుడు ఆ పాప ఇలా సమాధానం ఇస్తుంది

"నేను అందులో బోలెడన్ని ముద్దులు పెట్టి అవి మీకు మాత్రమే అందేలా ప్యాక్ చేసాను" అని చెప్తుంది

అప్పుడు వాళ్ళ నాన్న ఒక్క క్షణం నిశ్చేస్టుడై ,తన బంగారు తల్లి ని అపార్ధం చేసుకున్నాను అనుకొని
పాపకు ముద్దు పెడతాడు...
పిల్లల్ని అర్ధం చేసుకోవడం కష్టమైన పని
వాళ్ళను వాళ్ళ పనులను అర్ధం చేసుకోవాలనుకొంటే  మనం పిల్లల్లా ఆలోచించాలి
అంటే పిల్లల్లాగా స్వార్ధ రహితంగా  స్వచ్చంగా  ఆలోచించాలి
(ఈ కథ సేకరించబడినది)
హ్యాపీ ఫాదర్స్ డే


Tuesday, May 26

ఆనందమా నీ వెల ఎంత ?

05:31 Posted by srinivas No comments
నేను మొన్న మా  మేన కోడలి బర్త్ డే కోసమని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ....
అక్కడ  గ్రాండ్ గానే బర్త్ డే జరిగింది ... డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టారు...
చుట్టూ పక్కల జనాలు ,చుట్టాలు...ఫ్రెండ్స్..అందరూ...వచ్చారు ..
బల్లూన్స్...ఫ్లవర్స్ ...స్టేజి ....పిల్లలతోకోలహలం
డాన్స్ ప్రోగ్రామ్స్...etc
గిఫ్ట్స్ తెచ్చారు...చాక్లెట్లు కేకు లు భోజనాలు...
ఒక పండగలా జరిగింది...
కావున అందరూ ఆనందంగా ఉన్నారు...

    అసలు టాపిక్ లోకి వస్తే

        మరుసటి రోజు నేను ఇంటికి బస్సు లో సాయంత్రం గం||6 రిటర్న్ అయ్యాను....బస్సు ఫెసిలిటీ ఆ వూరికి సరిగా ఉండదు...అపుడే వచ్చింది ఒక బస్సు,అది ఆర్డినరీ బస్సు..సరే అని ఎక్కేసాను

ఆ బస్సు ప్రతి ఊరి వద్ద ఆగుతూ ఎండలో,కిక్కిరిసి పోయి చెమట వాసనలతో నాకు చిరాకు తెప్పిస్తోంది

 
       అంతలోనే ఒక యువకుడు బస్సు లోకి ఎక్కాడు...ఆ క్షణం లోనే నా పక్కనే సీట్ లో ఉన్న ఆయన లేచి వెళ్ళాడు ...ఆ యువకుడు  వెంటనే   వచ్చి నా ప్రక్కనే కూర్చున్నాడు..నాకు అతను నచ్చలేదు..ఏంటో నాకు జనాలు చూడగానే నచ్చాలి... అపుడు మాత్రమే నేను వాళ్ళతోనే ఫ్రెండ్లీ గా ఉండగలుగుతాను...  అతని చేతిలో ఒక కవర్ ప్యాకెట్ ఉంది...
నాకేమో కొత్త వారితో సరిగా మాట్లాడాలనిపించదు.....నేను అడగకుండానే మాట్లాడుతూ ఉన్నాడు...
అతని చేతిలో ఉన్న ప్యాకెట్ లో రూ||150 విలువగల కేకు ఉందని,చాకొలేట్సు ఉన్నాయని ... ఆ రోజు తన కూతురి పుట్టిన రోజు అని ...వెళ్లిన తర్వాత నా కూతురు చాల సంతోసిస్తుందని చెప్పాడు ,అప్పుడు నేను తన ముఖం లో వెలిగే   చాలా ఆనందాన్ని కనుగొన్నాను.ఏదైతే నేను ఇప్పటివరకు ఏ బర్త్ డే లో కనుగోనలేదో?
   


         కూలి పనులు అవి చేస్తాడంట మాట్లాడుతూ తెలుసుకున్నాను...తనకు ఆ రోజు కూలి రూ||300... దాంట్లో సగం ఖర్చు పెట్టగలిగాడు.ఇంతలో అతని వూరు వచ్చింది దిగి వెళ్ళిపోయాడు.ఇప్పుడు తను నచ్చాడు...ఎందుకు నచ్చాడో తెలియదు .కాని నచ్చాడు..ఒక మనిషి కి ఆహార్యం చూసి విలువ ఇవ్వకూడదు అని ఎవరో చెంపమీద కొట్టినట్టు అనిపించింది

      ఇప్పుడు నాకు బస్సులో ఎండ,చెమట వాసనలు ...తెలియడం లేదు...ఆ కిక్కిరిసిన బస్సు అందంగా కనబడుతుంది
అప్పుడు అనిపించింది ఆనందం కనిపిస్తే ఆనందాన్ని అడగాలని
ఆనందమా నీ వెల ఎంతా? అని



150 రూపాయలా ?లేదా అంతకన్నా ఎక్కువా?



Monday, May 4

ప్రేమ మార్గం బౌద్ధ మార్గం

సిద్ధార్థుడు  క్షత్రియుడు అయినప్పటికీ ఆ కాలం లో ఉండే సామాజిక వర్ణ వ్యవస్థను ...మూడాచారాలను...అనైతిక ధర్మాలను చూడలేక వదిలి పెట్టడం వల్లే సామాజిక అంతరాలు తొలగిపోతాయని ,అన్ని అప నమ్మకాలను వదిలేసి తపస్సు చేయడం ఆరంభించి ఇప్పుడున్న బుద్ధ గయ వద్దగల బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడు తన బోధనలో ప్రజ్ఞ ,కరుణ, శీలం లను బోధించిన మహానీయుడు
 బుద్ధుడు ఆ కాలం లో సామాజిక అంతరాలను తొలగించుటకు తన బోధనలు విశ్వ వ్యాప్తం చేసాడు
 ఇపుడు ఐక్య రాజ్య సమితి ఈ ప్రపంచం లో మానవీయ విలువలు కలిగి అతి ఉత్తమమైన ధర్మం బౌద్ధ ధర్మం అని ప్రకటించింది
ఎందుకంటే ఇక్కడ బుద్ధుని బోధనలలో కేవలం తర్క బద్ధమైన మానవీయత మాత్రమే ఉంది
అందుకే భారత దేశాన్ని పాలించిన మౌర్యులకాలం భారతీయులకు ఒక స్వర్ణ యుగం..

పుష్య మిత్ర శుంగుడు మల్లి ఆ సామాజిక అంతరాలను చిట్ట చివరి మౌర్య రాజును చంపేసి తీసుకురావడం జరిగింది

    అ తర్వాత వచ్చినవారు మన దేశం లో పుట్టిన బౌద్ధం లేకుండా చేసారు,మల్లి మనిషికి మనిషి కి మధ్య అంతరాలు ,స్వార్ధం కుల పిచ్చి మన దేశం లో వెళ్లి విరిసింది.

             అయినా, ప్రేమ కు పుట్టినిల్లయిన భారత దేశం మళ్ళి తనలో ప్రేమను నింపుకుంటుంది


"నేను అనే ఇగో ను ,కావాలి అనే కోరిక ను తీసేస్తే మిగిలేదే సంతోషం" 


                                        "ఇష్టం అంటే వాడుకోవడం ,కాని ప్రేమ అంటే కాపాడుకోవడం"



         "భారతదేశం పూర్వ వైభవాన్ని , ప్రతి మనిషిలో ప్రేమను ,అహింస ను సాదించు గాక!"
          బుద్ధ పౌర్ణిమ సందర్భంగా   బుద్ధ జయంతి  శుభాకాంక్షలు
బుద్ధం శరణం గచ్చామి!             దర్మం శరణం గచ్చామి!!                 సంఘం శరణం గచ్చామి!

   

Tuesday, April 21

పక్కోడి జీవితం -పండగ

నేను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తహ తహ లాడుతుంటాను...
పైకి మాత్రం అలాగా కనపడను..?

ఒక రోజు ఇలాగే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ...
అప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడు
వాళ్ళ డాడి వాడికి ఎదో పని చెప్తే వెంటనే వాడు హడావిడిగా వాడి ఫోన్ నా దగ్గరే పెట్టి ఇప్పుడే వస్తాను వెయిట్ చెయ్యు అని వెళ్ళిపోయాడు
ఫోన్  దాన్ని ఓపెన్ చేసి వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేసిన సంభాషణను చూసి మస్తు గా ఎంజాయ్ చేస్తూ చదవ సాగాను...అలా మొత్తం చదివేసాను...
అప్పుడు వాడి గురించి ఆలోచించాను
వాడి గురించి కొత్తగా ఒక అభిప్రాయం కలిగింది
మా ఫ్రెండ్ ఇంకా రాలేదు


ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు నా గురించి ఆలోచించాను
నా గురించి కూడా  కొత్తగా ఒక అభిప్రాయం కలిగింది
అసలు నేను ఎందుకు వాడి అనుమతి లేకుండా ఫోన్ తీసాను?
ఎందుకు ఇంటరెస్టింగ్ గా వాడి గర్ల్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చదివాను?
ఎగ్జైట్మెంట్ గా ఎందుకు ఫీల్ అయ్యాను?అంటే ఒక్కమాటలో శునకానందం ఎందుకు పొందాను?
అంతే కాకుండా వాడి గురించి ఆ రకంగా ఎందుకు అనుకున్నాను?నేనేదో గొప్ప వాడి నైనట్టు?
వాడు చేస్తున్నది తప్పు అయితే వాడిని సరిదిద్దోచ్చుగా అందుకే చదివానా?
అసలు వాడు చేసేది తప్పు అని నాకు ఎలా తెలుస్తది ?
ఈ ప్రపంచం లో ఎవరిదైనా తప్పు అని ఎవరైనా చెప్పగలరా?
కేవలం మనల్ని మనం తప్ప?ఎందుకంటే ప్రతి వారికి ఒక కారణం ఉంటుంది ఒప్పు చేసుకోవడానికి
కాని మన మనసుకు ఒక  కారణం చెప్పి ఒప్పించుకొనే ధైర్యం దాన్ని మోసం చేస్తే తప్ప ఉండదు!
ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకోవడం అంటే "మా ఫ్రెండ్ ని తప్పు వాడిని సరిదిద్దాలి అనుకోవడం"
అదే నాది తప్పు అయితే "నేను అసలు వాడి ఫోన్ ను ముట్టడం "
అంటే నాదే తప్పు....
వాడిది తప్పు అయితే వాడు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాడు కదా!
అప్పుడు వాడు అది తప్పో ఒప్పో తెలుసుకోలేనంత ముర్ఖుడేం కాదు గదా!


Thursday, April 9

bank లో నా ఇగో హర్ట్ అయ్యింది!

ఈ రోజు నేను బ్యాంకు లోకి అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి కరెక్ట్ 3-55pm కి లోపలికి ఎంటర్ అయ్యాను
క్రెడిట్ వోచేర్స్ దొరకడం లేదు అని క్లర్క్ ని అడిగితే టైం అయిపోయిందని careless జవాబు
దీంతో నాకు ఒళ్ళుమండి టైం చూడు అంటే cashier ని అడుగు తీసుకుంటాడో లేదో అని
వాడిని అడిగితే వాడు కూడా సేమ్ డైలాగ్..నా ఇగో హర్ట్ అయ్యింది
ఇలాగ కుదరదని బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగితే క్రెడిట్ వోచేర్ ఇచ్చాడు...
ఇప్పుడు cahsier ఇగో హర్ట్ అయ్యింది.

వాడి చేతిలో అవకాశం ఉంది గా

నేను vocher నింపే లోపల వెంటనే లాస్ట్ పర్సన్ cash తీసుకొని క్లోజ్ బోర్డు పెట్టాడు ...
నేను వెళ్లి డిపాజిట్ తిస్కోండి అన్నాను ..
వాడు ఇందాకే చెప్పాను  గా టైం అయిపోయిందని అని మల్లి careless జవాబు
ఇస్తూ వాడి దగ్గర స్టాక్ పెట్టుకొన్న వోచేర్స్ పాస్ చేస్తున్నాడు

నా ఇగో మళ్ళి మళ్ళి hurt అయ్యింది..


బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్దామంటే వాదేక్కడికో లోపల ఆడిటింగ్ లోకి వెళ్లి తగలడ్డాడు

అయిన వాళ్ళ వాలకం చూస్తుంటే మేనేజర్ ని కూడా ఒక ఆడిస్తున్నారు అనుకుంటాను

సరే వెయిట్ చేద్దాం అనుకుంటే సెక్యూరిటీ అక్కడ ఉన్నవాళ్ళందరినీ వేల్లగోడుతున్నారు.
వాళ్ళకి నేను మేనేజర్ తో మాట్లాడాలి అని చెప్పినపుడు
మీరు ఇక్కడ ఉండకూడదు అని
 బ్రాంచ్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చెయ్యాలని ఉచిత సలహా ఇచ్చాడు....
ఎంత బలుపు ఈ నా  క్లర్క్ లకు
నాకే ఇలా చేస్తే పాపం పల్లెటూరి జనాలతో ఈ నా సేవకులు ఎలా అడుకుంటారో...?
అంబుడ్స్మన్ కు వీళ్ళ గురించి కంప్లైంట్ చెయ్యాలన్నంత కోపం వచ్చింది..
అయినా వాళ్ళు పట్టించుకుంటారా?
అసలు వీళ్ళు 5 నిమిషాల ముందే క్లోజ్ చెయ్యడం  కర్రెక్టేనా ?
ఎమన్నా అంటే మాకు ఎంత పని ఉందొ తెలుసా ?అంటారు
భూలోకం లో వీళ్ళే పనిచేస్తున్నట్టు?
పనిలేని వాళ్ళు మిగతా వాళ్ళు అనుకుంటారేమో ఈ బ్యాంకు సేవకులు..!
ac లో కూర్చున్నాం అనుకుంటారు మాకెంత టెన్షన్ ఉంటుందో తెలుసా ?అంటారు
మరి ఎండలో పనిచేసే రైతు కన్నా కష్టమా వీళ్ళ పని.!
అసలు వీళ్ళని ఈ పని ఎవడు చెయ్యమన్నాడు?
ఎందుకు ఇక్కడకొచ్చి మా పనులను ఇబ్బంది కలిగిస్తున్నారు?
కష్టమైతే ఇంట్లో కుర్చోవచ్చు గా ,నిజంగా సేవ చెయ్యాలనుకునే చాల మంది కష్టపడే నిరుద్యోగులు లేరా?

మనకు ఇన్ని సార్లు ఇగో హర్ట్ చేసినా నోర్ముసుకొని ఉండాల్సిందేనా?
వీళ్ళని ఏం చెయ్యాలి?
అందరిని ప్రేమించు అని చెప్పే నేను
పని చెయ్యని వాళ్ళని ప్రేమించలేక పోతున్నాను ...
నా ప్రేమ తగ్గింది.!
అయిన ప్రేమించినా ప్రేమించక పోయినా వాళ్ళు అలాగే చేస్తారు


Thursday, March 26

cricket చూడొద్దు... ఆడాలి...

....ఇండియా టీం ఫైనల్ కి కాకుండా ఇండియా లోకి దూసుకెళ్లింది.


....టీం ఇండియా ఓడిపోయి మనకు మరొకరోజు టైం వేస్ట్ చేసుకోకుండా చేసింది

....వరల్డ్ కప్ లో టీం ఇండియా లో అందరికి batting రావాలని  ప్రతి ఒక్కmemberకి  బాటింగ్ అవకాశం కల్పించింది  
...పాపం newzealand ఫైనల్ కప్ గెలుచుకోవాలని.......  టీం ఇండియాను,newzealand వాళ్ళు ఎదుర్కోవడం కష్టం

కనుక australia ను ఫైనల్ కు పంపింది

 ....నెక్స్ట్ వచ్చే సిరీస్ లో టీం ఇండియా పై అతిగా ఆశలు పెట్టుకోవద్దని ఈ రోజు మ్యాచ్ ను ఇలా ఆడింది

....ఏ ఒక్కరికో క్రెడిట్ దక్కకుండా సమిష్టిగా ఓటమిలో పాలు పంచుకుంది

....ఆటలో గెలుపోటములు సహజం అందుకే మనవాళ్ళు క్వార్టర్స్ లో గెలిచారు ...సెమి లో ఓడారు

....ఆడిన ప్రతి మ్యాచ్ గెలిస్తే కిక్ ఏముంది...మాకు కిక్ కావాలి

....నాలుగు నెలలుగా దేశం కాని దేశం లో  పడరాని పాట్లు పడుతూ  ఉన్నమన వాళ్ళను మన దేశానికి పిలుద్దాం

ఇలాంటి జోక్స్ ఈ అర్ధ గంటలో బోలెడన్ని వచ్చాయి ....

చూసే మనకు తేలికగానే ఉంటుంది

కాని ఆడేవాళ్ళు వాళ్ళ శక్తులన్నీ పెట్టి ఆడతారు ...ఓటమి గెలుపు వాళ్ళ చేతుల్లో ఉండవుకదా..?

గెలిచినా ఓడినా టీం ఇండియా is a టీం
                                 our team


Wednesday, March 25

ప్రేమశాతం :విశ్వమానవుడిని నేనెలా అవుతా?

విశ్వమానవుడిని నేనెలా అవుతా?

ప్రాంతీయ వాది:
ఈ ప్రాంతం  నాది ...మీది  వేరే ప్రాంతం ...
మనది ఒకే భాష...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?

రాష్ట్రీయ వాది :
నాది నా రాష్రం ..మీది వేరే రాష్రం ...
మనది ఒకే దేశం...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?

దేశీయ వాది :
నాది నా దేశం...మీది వేరే దేశం...
మనందరిది గ్లోబల్ village..కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?

ప్రపంచవాది :
నాది భూమి ..మీది అంగారక గ్రహం...
మనందరిది సౌరకుటుంబం...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?

పాలపుంతవాది:
నాది సౌరకుటుంబం ...మీది వేరే నక్షత్ర కుటుంబం...
మనదే ఈ విశ్వం...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?

......
.....
....

అసలు ముందు నేనెవరిని ?

నాది ఈ జాతి.. మీది ఆ జాతి...
మనది మానవ జాతి ...కాని మీరు వేరు మేము వేరు
ఇప్పుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?

ప్రాంతీయ సమగ్రత కోరేవాడు ...ఇతర ఉప ప్రాంతాల్ని ద్వేశిస్తాడా?
రాష్ట్ర సమగ్రత కోరేవాడు ...ఇతర ప్రాంతాల్ని ద్వేశిస్తాడా?
దేశసమగ్రత కోరేవాడు ...ఇతర రాష్ట్రాలని ద్వేశిస్తాడా?
ప్రపంచ  సమగ్రత కోరేవాడు ...ఇతర దేశాల్ని ద్వేశిస్తాడా?
విశ్వ సమగ్రత కోరేవాడు ...ఇతర ప్రపంచాల్ని ద్వేశిస్తాడా?

సమగ్రత అనేది భూభాగం లో ఉంటుందా?
మనస్సులో ఉంటుందా?

ప్రాంతానికి  ఉండేది సమగ్రతా?
లేదా రాష్ట్రాలకి  ఉండేది సమగ్రతా?
లేదా దేశానికి ఉండేది సమగ్రతా?
లేదా ప్రపంచానికి ఉండేది సమగ్రతా?

అసలు సమగ్రత అంటే ఏమిటో తెలియనపుడు

అసలీ సమగ్రత అంటే ఏమిటి?దీనికి అంతం ఎప్పుడు?
అసలీ విషయం తెలియనపుడు విశ్వమానవుడిని నేనెలా అవుతా?
ఇంతకీ నేనెవరు?

Saturday, March 7

స్త్రీ ని గౌరవించకూడదా..?

ప్రేమ శాతం:serial part 23
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
స్త్రీ మూర్తి గొప్పది ...ఆరాధించదగినది


మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ!
------పురిటి నొప్పులు ఒర్చుకోలేదని అనుకుంటే
స్త్రీ ని గౌరవించకూడదా?
త్యాగం లో అనురాగం లో తరగని పెన్నిది మగువ!
------త్యాగం ,అనురాగం చూపించక పోతే
స్త్రీ ని గౌరవించకూడదా?
ఇంటికి దీపం ఇల్లాలే?
-----ఇంటికి ఇల్లాలు దీపం లా లేకుంటే
స్త్రీ ని గౌరవించకూడదా?
ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ మూర్తి తప్పక ఉంటుంది..
------విజయం వెనక స్త్రీ లేక పోతే
స్త్రీ ని గౌరవించకూడదా?
స్త్రీ కి విజయం లేదా?
ప్రేమను అందిస్తుంది
------ప్రేమను అందించని స్త్రీ ని గౌరవించకూడదా?
పిల్లలకు విద్యా బుద్దులు నేర్పేది మహిళ
------పిల్లల పట్ల బాధ్యత లేని స్త్రీ ని గౌరవించకూడదా?
అన్నివేళలా సహనం కలిగి ఉండేది
------సహనం ఓర్పు లేని స్త్రీ ని గౌరవించకూడదా?
ఇవన్ని లేని కొంత మంది పురుషుల్ని కూడా  గౌరవింఛినపుడు
స్త్రీ ని గౌరవించకూడదా?
ఈ లక్షణాలు ఉన్న స్త్రీనే గౌరవించాలా?
.................................................................................
స్త్రీ కి మాత్రమే ఈ ప్రత్యేక లక్షణాలు ఎవరు ఇచ్చారు..
స్త్రీ అంటే కచ్చితంగా ఈ గుణాలు ఉండాలని
ఉగ్గుపాలనుండి స్త్రీని గూర్చి మనకెందుకు నూరి పోశారు?
ఇవి స్త్రీ మూర్తి గోప్పతనాలా ?లేదా సమాజం లో మనకు నచ్చినట్టు
ఉంచడానికి స్త్రీ ని ఇరికించిన చట్రమా?
అందుకే మనకు ఎదురయ్యే స్త్రీ మూర్తి లో పొరపాటున
మంచి లక్షణాలు లేక పోతే ...ఆ స్త్రీ ని  ఏమంటాము?
అందుకే స్త్రీ అంటేనే అలాగుండాలి లేకపోతే ?
---------------------------------------------------------------
ప్రకృతి ,మరియు సృష్టి  స్త్రీకి కొన్ని శరీర ధర్మాలు కల్పించినా
మానసిక ధర్మాలు మాత్రం మనం తయారు చేసుకున్నవే కావా?
ప్రపంచ మనుగడలో స్త్రీ మూర్తి కి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో
అన్ని బాధ్యతలు పురుషుడు కూడా తీసుకోవడమే
 ప్రతి రోజు మహిళా దినోత్సవాన్నిజరుపుకుంటున్నట్టు
లేక పోతే ఈ రోజు మాత్రమే మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు

-----------------------------------------------------------
HAPPY WOMENS DAY TODAY....?

PREVIOUS>>



Tuesday, February 17

ప్రేమశాతం :నిరాడంబరుడిని నేను... నాకు ఆడంబరమెందుకు?

ప్రేమ శాతం:serial part 22
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
శివం అంటే నీలోఉన్న ప్రేమ
మనలోని ప్రేమ శాతం తగ్గుతూ
స్వార్ధమనే విషం పెరిగి ఇక భరించలేని స్థితి కి చేరిన సమయమే....
మనలోని శివుడు విషం తీసుకోవడం...!
అందుకే ఈరోజు మనం మనలోని విషాన్ని తగ్గించుకోవడం కోసం
మనల్ని మనం ఎరుక చేసుకోవాలని జాగరణ చేయడం
కేవలం ఒక్కరోజు తో మనం మనలోని శివత్వాన్ని పెంపొందించుకోలేము
ప్రతి రోజు మనలోని ప్రేమ శాతాన్ని లెక్కించుకోవలసిందే!
మన బిజీ జీవిత గమనంలో కనీసం ఒక్కరోజైన మనల్ని గూర్చి మనం తెలుసుకోవాల్సిందే!
అదే మనం శివునికి చేసే అభిషేకం

శివ తత్వం  మనకి అన్ని ఇచ్చి తను మాత్రం అన్ని వదులుకొని
నిరాడంబరుడిని నేను.... నాకు ఆడంబరమెందుకు? అన్నట్లు
మనం కూడా ఆడంబరాలైనా కోపం స్వార్ధం అసూయ ద్వేషం తొలగించుకుంటే
మనలో కూడా నిరాడంబరం అయిన  ప్రేమ మిగులుతుంది

                                          శివ తత్వం  శివోహం శివం
             ప్రపంచం అంతా శివమయం ,ప్రతి వస్తువు శివమయం,ప్రతి మనిషి శివుడే
                                                                                                                              >>PREVIOUS PART

Saturday, February 14

ప్రేమశాతం -నిజమైన ప్రేమ దేన్ని కోరుకుంటుంది

ప్రేమ శాతం:serial part 21

 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
ప్రేమ కోసం వాలెంటైన్ తన ప్రాణాన్నేత్యాగం చేసాడు...
అందుకే ఈ రోజు ప్రేమికుల రోజు,
కాని ప్రేమించబడే వాళ్ళు ప్రేమించిన వారి ప్రాణ త్యాగాన్ని కోరుకోరు?
ప్రాణాల్ని తియ్యాలనుకోరు!
నిజమైన ప్రేమ బయటికి కనపడినా కనపడకపోయినా
ప్రేమ అనేది ఎల్లపుడు ప్రేమించబడే వాళ్లకి అందించబడుతుంది.

అలా అందించబడనప్పుడు అది ప్రేమ కాదు
ప్రేమించడం అంటే ఆ వ్యక్తి ఆనందాన్ని మనం కోరుకోవడం
ప్రేమించడం అంటే మన కోసం చెయ్యడం కాదు ,తన కోసం చెయ్యడం
ప్రేమిస్తే ఆనందం వెయ్యాలి
నిజంగా ప్రేమించిన వాడెవ్వడు బాధపడడు
ఎందుకంటే ప్రేమ ను ఇస్తాడు, తీసుకోవాలనుకోడు
తీసుకోవాలనుకున్నపుడే మనకు బాధ, కోపం ,దుఖం కలుగుతాయి
అందుకోసం ప్రేమించండి...స్వచ్చంగా ..కల్మషం లేకుండా..స్వార్ధం లేకుండా
అమ్మాయి అబ్బాయినే కాదు
అబ్బాయి అమ్మాయినే కాదు
అందరిని... మన చుట్టూ ఉన్న సమాజాన్ని

మనల్ని ద్వేషించే వాళ్ళని ,మనల్ని ప్రేమించే వాళ్ళని...!
ప్రపంచాన్ని ప్రేమమయం చెయ్యండి
 <<PREVIOUS PART                                                                                    NEXTPART>>

Saturday, February 7

ఆదివారం వచ్చేసిందోచ్

23:01 Posted by srinivas No comments
ఏంటో ప్రతీ సారి ఆదివారం ఆలస్యంగా లేద్దామనుకుంటాను
అదేంటో గాని సరిగ్గా 6 గంటలకే మెలకువ వస్తుంది
మరేమో వీక్ డేస్ లో అయితే ఎంచక్కా 7-30am వరకు గాని బలవంతంగా మంచం దిగని నేను
8-00am వరకు రెడీ అవ్వాలి కదా!
కనీసం ఆదివారం అయినా హాయిగా నిద్రా దేవితో పడుకుందాం అనుకుంటే
ఏంటో ఆదివారం ఆది లోనే ఇలా జరిగిపోతుంది...!
----
చిన్నప్పుడు ఆదివారం వచ్చిందంటే
ఇంట్లో వాళ్ళతో బయట సినిమాకో షికారుకో తిరగాలి అనిపించేది
కాని ఇప్పుడు అది రోటీన్ గా అయిపొయింది
అందుకే ఎదేమైనా ఆదివారం పూర్తి సెలవు గా ప్రకటించుకోవాలని అంటే
(అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పూర్తిగా ఇంట్లోనే పూర్తి సమయం  కేటాయించడం )

అలా కుదరదు
ఈ ఫ్రెండ్స్ ఉన్నారే ..!ఎదో ఒక ప్రోగ్రాం పెట్టేస్తారు ...!
అలా ఆదివారాన్ని కూడా బిజీ చేసేస్తారు..!
చిన్నప్పటికి ఇప్పటికి ఎంత మార్పు?
---
ఆదివారం అంటే 24 గంటలు కాదు 12గంటలు మాత్రమే!
ఎందుకంటే అంత త్వరగా సోమవారం వచ్చేస్తుంది మరి...!
మొదటి 12గంటలు చాలా వేగంగా గడిచిపోతుంది.ఎలా గడిచి పోయిందో తెలియకుండా
అదేదో మూవీ లో dialogue లో చెప్పినట్టు రావమ్మ మెరుపు తీగ అన్నపుడు
మెరుపు తీగ లా ఒక అమ్మాయి  వచ్చి మాయం అయినట్టు ఆదివారం సమయం  గడిచి పోతుంది
తర్వాత 12గంటలు రేపు సోమవారం అనే దిగులుతో గడిచిపోతుంది
చిన్నప్పటి నుండి అంటే స్కూల్ కి వెళ్ళే సమయం నుండి ఇదే ప్రాసెస్
---
చూసారా ?
అపుడే 12గంటలు అయిపొయింది ...!
ఇంకా మిగిలుంది కేవలం 12 గంటలే!
---
ఎన్నాళ్ళ నుండో పెండింగ్ లో ఉండే పనులు ఆదివారానికి postpone చేస్తుంటాను
అంటే ఇంట్లో పనులు అనుకునేరు ?
laptop లోని desktop పైన పేరుకున్న చెత్త ను తొలగించడాలు ,
అనవసరంగా పెరిగిపోయిన folders,unused files తీసేయ్యడాలు
లాంటివి అన్నమాట అది కూడా ఈ రోజు కుడురుద్దో లేదో ...!
---
అవును కదా ఈ పోస్ట్ రాసే బదులు ఆ పని చేసుకుంటే బాగుంటుంది ...
సరే ఆ పని మొదలు పెడతాను
హ్యాపీ సండే ....

Thursday, February 5

ప్రేమశాతం-నేను నాన్న తో మాట్లాడను

ప్రేమ శాతం:serial part 20
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు.... 
మనలో ఉండే ప్రేమ శాతం తగ్గే అంశాలు మనలోన చిన్నప్పటి నుండి ఏర్పడే భావాలు,వాటి పట్ల మన చుట్టూ ఉండే  మనుషుల ప్రతిస్పందనలు కారాణాలు
అందులో  మరో కారణం
నేను చిన్నపుడు ఒకసారి మా నాన్న పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నం చేసాను
అప్పుడు  మా నాన్న గారూ నేను ఇవ్వను ,నువ్వు పుస్తకం చించి పడేస్తావు అని చెప్పారు
నేను చెప్పాను నేను చింపి వెయ్యను ,చూసి ఇస్తాను అని కాని మా నాన్న గారూ వినలేదు

టీవీ పైన ఉండే ఒక పింగాణి బొమ్మను తీసుకోవాలని టీవీ టేబుల్ దగ్గర ఒక కుర్చీ వేసుకొని బొమ్మ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయం లో ఆ బొమ్మను పగులగోడతానేమో నని నా పైన అరిచేసారు..

అప్పుడు   కూడా చెప్పాను నేను పగులగొట్టను అని చెప్పినా కాని నన్ను కసురుకొని బొమ్మ ఇవ్వలేదు

అందుకే నేను డిసైడ్ అయ్యాను   నేను నాన్న తో మాట్లాడను అని


అలాగా నేను మాట్లాడకూడదు అని గట్టిగా అనుకొని ఆ రోజు పడుకుండి పోయాను

తెల్లారి లేచిన తర్వాత నేనేం డిసైడ్ అయ్యానో మర్చిపోయాను ,ఎంచక్కా నాన్న గారి తో మాట్లాడుకుంటూ స్కూటర్ పైన  స్కూల్ కి వెళ్ళిపోయాను

కాని నేను ఇక్కడ మర్చిపోలేనిది ఏమిటంటే
 మనకన్నతక్కువ నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ,చిన్నవాళ్ళు సరిగాపనిచేయ్యలేరు అని,
వాళ్ళు మనపైన ఆధారపడే వాళ్ళుగా ఉంటారని
అసలు వాళ్ళను మనుషుల్ల కూడా చూడడం వేస్ట్ ఏమో అని ,
వాళ్ళు ఏదైనా పనిని ఫెయిల్ చేస్తారు అని
ఎవ్వరిని నమ్మకూడదు అని,
వాళ్ళు మనలాగా సహనం తో పని చెయ్యరు అని
ఇలా అపనమ్మకాన్ని పెంపోదించుకోవడం జరిగింది
నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ..
మనల్ని నమ్మే వాళ్ళని మనం ఎలాంటి పరిస్థితుల్లో మోసం చెయ్యకూడదు
ఎక్కడో ఒక msg  చదివాను

If you succeed in cheating some one,
Dont think that the person is a fool....
Realise that the person trusted you so much
more than you deserved...!!
(దీనిని తెలుగు లోకి అనువదించాను కాని ఆ msg లో ఉండే ఫీల్ రాలేదు ..అంటే నా తెలుగు లో భావుకత కొంచెం తక్కువ ...అందుకే ఇంగ్లీష్ లోనే ఇవ్వడం జరిగింది
దయచేసి ఎవరైనా వీక్షకులు ఫీల్ తో కూడిన తెలుగు అనువాదం కామెంట్ చెయ్యగలరు )
అలా ఎదుటి వ్యక్తి ని నమ్మడం అనేది నా అంతరంగం నుండి తొలగించడం జరిగింది
 అలా నాలో ఉన్న ప్రేమశాతం మళ్ళి తగ్గింది  

Sunday, February 1

Sunday, January 25

జెండా పట్టుకొని ప్రభాతభేరి లోఇలాగే తిరగాలి

16:20 Posted by srinivas No comments
నేను చిన్నపుడు జెండా పట్టుకొని ప్రభాతభేరి  లోఇలాగే తిరగాలి అనుకునే వాడిని
కానీ ఎం లాభం ?స్కూల్ లో లైన్ లో చిన్న జెండా ఇచ్చి ఊరంతా తిప్పేవారు! 


 విదేశీయుల పాలన నుండి విముక్తి పొందిన ఇతర దేశాలలోకంటే మన దేశంలో మాత్రమే ఐక్యతభావం,ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది దీనికి కారణం మన సర్వోన్నతమైన "రాజ్యాంగం"

మనుషులందరూ సమానం ,ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని చెప్పడమే కాదు  ఆచరణ లో చూపెట్టుతోంది మన "రాజ్యాంగం "
                                                               సెల్యూట్ to nation

ప్రేమశాతం -అమ్మ తిట్టింది ,పెద్ద వాళ్ళు ఇంటికి వస్తే అసలు పలకరించవు అని?

ప్రేమ శాతం:serial part 19
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
మా అమ్మ తిట్టింది ,ఎందుకంటే
పెద్ద వాళ్ళు ఇంటికి వస్తే అసలు పలకరించవు ,
మంచోడివే కదరా?వాళ్ళకేమైనా నీవల్ల సహాయం అవసరం ఉంటె చేస్తావు కదా ?
పలకరించడానికి నీకేం రోగం ?వాళ్ళు నీకు పొగరు అనుకొరూ !అని తిట్టింది,
అప్పుడు ఆలోచించాను ,అవును నేనెందుకు పలకరించను?నాకు నిజంగానే పొగరా?
అసలునేనేందుకు ఇలాగ తయారు అయ్యాను?

మనసు లోతుల్లోని జ్ఞాపకాల పొరలు ఒక్కొక్కటి గా తెరుస్తున్నాను
అప్పుడు తెలిసింది నా ప్రవర్తనకు కారణం
నేను చిన్నపుడు మా బడి లో ఒక తెలుగు మాష్టారు ఉండేవాడు
అప్పుడు తెలుగు లో ఒక పాఠం చెప్పారు పేరు గుర్తురావడం లేదు
ఆ  పాఠం లో పలకరింపులు అనే కాన్సెప్ట్ మీదే తన కాన్సెప్ట్ చెప్పారు
ఆ కాన్సెప్ట్ ఇంత బలంగా ఎక్కిందని ఇప్పుడు అర్ధమయినది
ఏంటంటే సాదారణంగా మన ఇంటికి చుట్టాలు వస్తున్నపుడు
మనం అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి
ఇప్పుడే వస్తున్నారా?
వాళ్ళు రావడం చూస్తూ కూడా వాళ్ళను ఇప్పుడేనా రావడం అడగుతారు మన వాళ్ళకి ఎంత తెలివి?
అనివెటకారంగా అన్నాడు ?
ఓహో మనం దాన్ని యిట్టె క్యాచ్ చేసాము క్యాచ్ అంటే అలా ఇలా కాదు డైవ్ కొట్టి మరి క్యాచ్ పట్టేశాను
ఇప్పుడే వస్తున్నారా ?అని చూసుకుంటూ కూడా వాళ్ళని అడగటమేమిటి?స్టుపిడ్ లాగా ?
కావున ఈ వాక్యం వాడకూడదు అని డిసైడ్ అయ్యాను
మరో ప్రశ్న :బాగున్నారా?అని
వాళ్ళను చూస్తే నే తెలిసి పోతుంది బాగానే ఉన్నారు అని మళ్ళి ఈ తోక ప్రశ్న అడగడం అవసరమా ?
పైగా బాగా లేని వాళ్ళని బాగున్నారా ?అని అడిగితే వాళ్ళను బాధ పెట్టినట్టు అవుతుందని కూడా తేల్చేసారు ?
ఇక మన దగ్గర ఉన్న ఆ ప్రశ్న కూడా వాడకూడదు అని డిసైడ్ అయ్యాను...?
కాని పాఠం లోని concept మధ్యలోనే బెల్ మోగింది ,మా మాష్టారు వెళ్ళిపోయారు
మరునాడు కొత్త టాపిక్ తో వచ్చారు ?
కావున పలకరింపు ఎలా చెయ్యకూడదో చెప్పారు కాని ఎలా చెయ్యాలో చెప్పలేదు?
పోనీ నమస్కారాలు లాంటివి పెడదామా అంటే వాళ్ళు వింత గా చూస్తారు ..?
ఎందుకంటే అలాంటివి వాళ్ళకు ఎక్కడా కనపడడం లేదేమో..?
పైగా మనకు కూడా అలాంటి అలవాటు లేదేమో అంటే ఇక్కడ చిన్నప్పటి నుండి వాళ్ళతో ఇలాగే అంటే బాగున్నారా?లాంటి పలకరింపులే కదా వాడేది
 మరి ఇప్పుడు ఎలా ?పలకరించేది
దానికి నాకు తెలియకుండానే ,ఒక చిన్న నవ్వుతో పలకరించడం అనే కాన్సెప్ట్ పెట్టుకుని ఉంటాను
కాని నా నవ్వు వాళ్లకి కనపడడం లేదు అని మా అమ్మ తిట్టితే అర్ధమైంది
అదన్న మాట ఇప్పుడు తెలుసుకున్నాను
వాళ్ళు వింత గా చూసిన చూడక పోయినా నమస్కారాలే బెటర్ అని ఏమంటారు?
అది కాకుండా మరేదైనా ఉంటె తెలియ చెయ్యండే?


Monday, January 19

ప్రేమ శాతం:డబ్బు జీవితం

ప్రేమ శాతం:serial part 18
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
జీవితం  లో డబ్బుకు చాల విలువ ఉంటుంది...ఇది కాదనలేని సత్యం
కాని మొన్న జరిగిన్ ఒక సంఘటన ఒక రకమైన భావాన్ని కలిగించింది
ఒక ప్లంబర్ తో పని పడింది..మా ఇంటికి వాటర్ పైప్ రిపేర్ చేయ్యిన్చాల్సి వచ్చింది

అప్పుడు అతనితో నా సంభాషణ ఇలా జరిగింది
నేను :మా ఇంట్లో పని ఉంది ఎంత తీసుకుంటావు?
ప్లంబర్:400 రూపాయలు నాకు రోజూ కూలి ఇవ్వండి
నేను :అబ్బా చిన్న పనే కదా 350/- తీసుకో అన్నాను
ప్లంబర్ :లేదు కుదరదు అన్నాడు
నేను (మనసులో):అబ్బా వీడికి ఎంత పొగరు ..కుదరదు అని చెప్తున్నాడు ఎంతో కొంత కు ఒప్పుకోవచ్చు కదా
సర్లే మన అవసరం ,ఇంకా ఎక్కువ పని చేపించుకోవాలి
నేను (బయటకి):సర్లే వచ్చేయ్యు
పని చేసాడు
ఇంకా అదనం పనులను పురమాయిస్తున్నాను
అప్పుడే తనకి ఫిట్స్ వచ్చాయి కొట్టుకుంటున్నాడు
గట్టిగా అరుస్తున్నాడు
నేనెపుడు ఫిట్స్ చూడలేదు
మా వాళ్ళు వచ్చి తన చేతిలో తాళం చెవులగుత్తి పెడుతున్నారు
నేను స్థాణువు ల చూస్తున్నాను భయం తో
అప్పుడు నా మనసులో భావాలు ఇలాగ ఉన్నాయి
తన ఇల్లు తెలియదు నాకు ఎక్కడికి తీసుకెళ్ళాలి
108కి ఫోన్ చేసినా తన  ఇంటి వాళ్లకి ఎలా సమాచారం అందించాలి
ఛీ ఒక్క క్షణం లో జీవితం ఎటు వెళ్తుందో ఏమో 50/-రూపాయల కోసం భేరం ఆడాను
డబ్బు కన్నా విలువయినది జీవితం
నేను మనస్పూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను తనకు ఏమి కావద్దని
తనని ఉపయోగించి ఎక్కువ పనులు పురమాయించాలి అనుకున్న నన్ను నేను తిట్టుకున్నాను

Saturday, January 10

అధ్బుతం :డబ్బుతో ఆనందాన్ని కొనవచ్చు

23:03 Posted by srinivas No comments
ఈ వారం అద్భతం లో :డబ్బుతో ఆనందాన్ని కొనవచ్చు

అవును డబ్బు తో ఆనందాన్ని కొనవచ్చు
కావాలంటే క్రింది video ను చూడండి
ఈ video లోని వ్యక్తి 10000 రూపాయలు తీసుకొని కష్టపడి పనిచేసే వారి దగ్గరికి  వెళ్లి వాళ్ళ వస్తువులను 
రూ||1000 లకు కొంటాడు ఉదాహరణకు ఒక టీ అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి టీ తాగేసి రూ||1000 లు ఇస్తాడు 
అప్పుడు వాళ్ళ ఆనందాన్ని అలాగా కొంటాడు 
ఇప్పుడు చెప్పండి డబ్బుతో ఆనందాన్ని కొనచ్చా లేదా?
ఇది అద్భుతం కాదా?

ప్రేమశాతం:అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి?

ప్రేమ శాతం:serial part 17
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....

ఇంటర్ ,graduation,PG లు ఇప్పుడు ఉద్యోగం చేసే సమయాల్లో ఎందరో అమ్మాయిలు తారస పడ్డారు...!పడుతున్నారు..!

గంటలు గంటలు  చూడాలని పించే వాళ్ళు ..! అలాగే మాట్లాడలనిపించే వాళ్ళు..!

వాళ్ళ అందమైన నవ్వుని మిస్ కాకుండా చూడాలని పించే వాళ్లు..!అందమైన గొంతుతో నా పేరు పిలిపించుకోవాలని నన్ను తాపత్రయపడేలా చేసేవారు..!

సమాజం లో కొన్ని విషయాల పట్ల చాల మంచి గా స్పందించే వాళ్ళు ..!సున్నిత మనస్సు గలవారు..!,


పొగరుగా కనీసం కూరలో కరివేపాకు లా కూడా పట్టించుకోని వాళ్ళు..!ఫోన్ లో గంటలు గంటలు సోది చెప్పేవాళ్ళు..!

msg చాటింగ్ నుండి whatsup msg చేసే వాళ్ళు ! ఓదార్చే వాళ్ళు ..!



సంతోషాన్ని పంచేవాళ్ళు ..!ఏడ్చే వాళ్ళు ..!సరదాగ ఉండే వాళ్ళు..!

ఇంత మంది నాకు నచ్చే వాళ్ళు..!ఇంత మంది లో ఎవరిని ఎన్నుకోవాలి?
అందుకే ఏ ఒక్కరి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టలేదు..!ఎందుకంటే ఒక్కరితో ఉంటె ఇన్ని ఫీలింగ్స్ మిస్ అయ్యేవాడిని కదా?
అపార్దం చేసుకోకండి .!

నేను అందరూ అనుకుంటున్నట్టు ఆ "ప్రేమ"  చెయ్యలేదు అండి..!కేవలం స్నేహం మాత్రమే చేసాను..!

కాని నేను చూసే అందరూ అమ్మాయిలు ,అబ్బాయిలు  సింపుల్ గా మనం అనుకునే "ప్రేమ" లో పడే వారు ..!
అంతే సింపుల్ గా బయటికి వచ్చేవారు..!కొందరు అందులోనే ఉండేవారు..!

నేను కూడా చెయ్యొచ్చు కదా అనుకునేవాడిని..!కాని కొంచెం క్లోజ్ అయ్యేసరికి ఎక్కడో ఎదో తేడా కొట్టేది ..!

కారణం నాకు ప్రేమించడం రాదు ..!ప్రేమ తీసుకోవడం మాత్రం వచ్చు ..!
పాపం వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని ప్రేమ ఇస్తారు?

అంటే నాకు ప్రేమ పరీక్షలో ప్రేమ శాతం 50% మార్కులు..!

అయినా ఫెయిల్ అయ్యాను..!అందుకే నేను ప్రేమించే లేదా నన్ను ప్రేమించే వ్యక్తి దొరకలేదు?

ఒకే ఒక్క శాతం పెంచుకున్నా గాని నాకు కూడా ప్రేమించే వాళ్ళు దొరుకుతారేమో?

అప్పుడు నేను కూడా ప్రేమిస్తానేమో? 

అయినా సాటి  మనిషిని ప్రేమించలేని నేను అసలు అమ్మాయిని ఎందుకు ప్రేమించాలి?

అమ్మాయి కూడా సాటి మనిషే కదా?

Wednesday, January 7

ప్రేమశాతం: నాన్న ప్రేమ ఎవరివైపు?- ఒక అన్న -ఒక తమ్ముడు

ప్రేమ శాతం:serial part 16
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
ఒక అన్న -ఒక తమ్ముడు -ఒక నాన్న..
అనగనగా ఒక ఊరిలో ఒక కుటుంబం ,అందులో ఒక అన్న ,ఒక తమ్ముడు ,ఒక నాన్న ఉండేవారు..

అన్న బలవంతుడు ...తమ్ముడు బలహీనుడు..
తమ్ముడి కి రావలసిన వస్తువులను అన్న లాక్కొనే వాడు
అన్న ఎప్పుడూ తన తమ్ముడి తో గొడవ పడేవాడు...
అప్పుడు నాన్న ఏమి చెయ్యాలి?

అ)తటస్థంగా ఉండాలి
ఆ)అన్న వైపు ఉండాలి
ఇ)తమ్ముడి వైపు ఉండాలి
ఈ)తెలియడం లేదు

జవాబు అ)తటస్థంగా ఉండాలి...
నేను ఇద్దరి కి తండ్రిని, కావున నేను గొడవలో కలుగ చేసుకోకూడదు,నాకు ఇద్దరూ సమానం,ఇలా ఉంటే తమ్ముడు అన్యాయం అయిపోతాడు కదా?

జవాబు ఆ)అన్న వైపు ఉండాలి...
అన్న బలవంతుడు ...ఇప్పుడు అన్న వైపు ఉంటే తమ్ముడు పూర్తిగా అన్యాయం అయిపోతాడు

జవాబు ఇ)తమ్ముడి వైపు ఉండాలి..
తమ్ముడు బలహీనుడు ...తమ్ముడికి రావలసిన వస్తువులు ఇప్పించవచ్చు..కాని పెద్దకొడుకు అన్యాయం నీకు తమ్ముడోక్కోడే కొడుకా? అంటాడు,అంటూ తండ్రికి దూరం కావచ్చు


జవాబు ఈ)తెలియడం లేదు..
నాకు కూడా తెలియడం లేదు

జవాబు ఇ) కరెక్ట్ అనిపించినా అది కూడా పూర్తి గా కరెక్ట్ అనిపించడం లేదు అనిపిస్తోంది..ఎందుకంటే పెద్ద కొడుకు దూరం అవుతాడు కదా?పోతే పోనీ వాడు ఎలాగో చెడ్డోడే కదా అనుకుందామా?అలా కూడా అనుకోవడానికి వీలు కనిపించడం లేదు ...పెద్ద కొడుకు తన తండ్రి పట్ల తన పూర్తి బాధ్యతలు నిర్వహిస్తే..?చిన్న కొడుకు నిర్వహించని సందర్భం ఉండొచ్చు...? ఇలాంటి ధర్మ సందేహం లో ధర్మం చిన్న కొడుకు వైపే చూపించినా ఎక్కడో ఎదో కొడుతోంది,
ఎవరైనా పెద్దలు లేదా తెలిసిన వారు సలహా ఇవ్వగలరు
                                                                                    ............కృతజ్ఞతలతో

క్లిక్ చెయ్యండి  మనసు ఏడ్చింది 

Monday, January 5

ప్రేమ శాతం:నా మనసు ఏడ్చింది

ప్రేమ శాతం:serial part 15
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....

అవును నా మనసు ఏడ్చింది
నిజంగానే నిజం ..నా మనసు ఏడ్చింది..?
చూడాలని ఉందా?అయితే చూడండి
కనపడని కన్నీళ్లు ..నా చెంపల పై నుండి కారుతున్నాయి..
గుండెలోతుల్లోని అగ్నిపర్వతం పేలి ...రక్తం లావా లా తిరుగుతోంది..
గొంతు దాటలేని ఆక్రందన పిచ్చి పిచ్చి గా రంకెలు వేసి మౌనం గా రోదిస్తోంది..
వేడివాయువులు ఉచ్వాస నిశ్వాస లుగా మారి నిట్టూరుస్తున్నాయి..

అంతులేని అగాదాన్ని , అఖాతం లోని నీరు నింపుతుంది...
అంతా పిచ్చి భ్రమ ...అగాధం ఎప్పటికైనా నిండుతుందా?
నిండదని తెలిసి నేనెందుకు నింపుతున్నాను...
ఓహ్!నేను మనిషినికదా?
ఇలాగే ప్రయత్నిస్తాను ...మూర్ఖుడిలా!
మనిషి ఏడిస్తే అందరూ ఒదారుస్తారు...
కానీ మనసు ఏడిస్తే ...?
అందుకే ఎవ్వరికీ తెలియకుండా ...అందరితో నవ్వుతూ ...మనసులోనే ఏడుస్తోంది..!
ఎందుకంటే నువ్వేడ్చినా ఏడవకపోయినా,
నువ్వెప్పుడూ ఒంటరినేనని ఏడుస్తోంది...!
నన్ను ప్రేమించే మనసు లేదు..?
ప్రేమించానని చెప్పిన వారి ప్రేమ కాలం తో పాటు మారి పోతోంది
అదేనండీ! నా స్వార్ధం నన్ను ఒంటరిని చేసింది..!
ఎదో ఒక రోజు నా లో ప్రేమ చిగురించిన క్షణాన
నేను తప్పకుండా నవ్వుతాను...
కాదు నా మనసు తప్పకుండా నవ్వుతుంది ..! 

Saturday, January 3

ఈ వారం అద్భుతం :మొట్ట మొదటి భారత దేశ మహిళా ఉపాధ్యాయురాలు-సావిత్రిబాయి ఫులే

05:02 Posted by srinivas No comments

ఈ వారం అద్భుతం లో:

భారతదేశం యొక్క 'ఫస్ట్ లేడీ' టీచర్: Savitribai ఫులే

వేల కొవ్వొత్తులను ఒకే ఒక కొవ్వొత్తిని నుండి వెలిగిస్తారు,అంటే  కొవ్వొత్తి జీవితం కాలం అపరిమితం - బుద్ధ
అలాంటి కొవ్వొత్తి: సావిత్రిబాయి ఫులే (3 వ జనవరి 1831- 10 మార్చి 1897),
భారతదేశం లో ఇతర సామాజిక ఆకృత్యాల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వనితా మూర్తి . 
చరిత్రకారులు వివిధ కారణాలతో కొన్ని చరిత్రలను తోక్కేసారు...?ఎందరో సంఘసంస్కర్త లుగా చెలామణి అయ్యారు ...కాని నిజమైన సంఘసంస్కర్తల ను ఎందుకు పట్టించుకోలేదు?
సంఘసంస్కర్త అంటే కులాల్ని కాదు సంస్కరించుకోవడం ..సంఘాన్ని సంస్కరించాలి,సంఘం అంటే అన్ని కులాలు మతాలు..
అలాగా అన్ని కులాల వారికి విద్య అందించాలనే ఉద్దేశ్యం కలిగిన మహాత్ముడు ...జ్యోతిబా పూలే..ఆ మహానీయుని భార్య సావిత్రి బా పూలే..
వాస్తవంగా చాలామంది నేటి మహిళలకు ఈవిడ గురించి ,ఈవిడ వారి జీవితాలకు చేసిన సేవ గురించి తెలియక పోవచ్చు.
భారతీయ సమాజంలో మహిళలకు బోధనచేసి వారియొక్క గొప్పతనాన్ని చాటిన సావిత్రిబాయి ఫులే, గొప్పతనం గురించి తెలియదు. కేవలం మహిళలకు విద్య ఒక దండన నేరం లా భావించారు; ఆమెకు నేటి మహిళలు మరియు ప్రతి ఒక్కరూ ఆమెపట్ల  కృతజ్ఞత కలిగి ఉండాలి 
ఎందుకంటే,  భారతీయ సమాజంలో మహిళల పై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి  సావిత్రిబాయి ఫులే
 భారతదేశం లో  సావిత్రిబాయి ఫులే, అణగద్రొక్కబడినవారి కోసం మరియు మహిళల కోసం మొట్టమొదటి పాఠశాల ప్రారంభించి భారతదేశం యొక్క మొదటి మహిళ గురువు .అయిన ఆవిడ పుట్టినరోజు ను మనం ఎందుకు జరుపుకోవడం లేదు?
ఫోటో క్రెడిట్:http://www.mahatmaphule.com/
మహాత్మా జ్యోతిబాఫులే మరియు అతని భార్య సావిత్రిబాయిi ఫులే కులతత్వం మరియు బ్రాహ్మణ-కులతత్వం సంస్కృతికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన వారిలో మొదటివారు. అయితే, ఆమె మొదట నిరక్షరాస్యురాలు, ఆమెను ప్రోత్సహించింది ఆమె భర్త  మహాత్మా జ్యోతిబాఫులే. 
తరువాత ఆమె తన భర్త ప్రారంభించిన  పాఠశాలలో భారతదేశం యొక్క మొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా  మారింది.
 సావిత్రి బాయి పూలే పాఠశాల కు వెళ్ళే సమయంలో దారిమధ్యలో కొన్ని వర్ణాల సనాతన ప్రజలు అనేక సార్లు రాళ్ల తో అదేపనిగా కొట్టుతూ మరియు ఆమె పైన పేడ విసిరే వాళ్ళు.దానికి ఆమె మరో చీరను తన సంచిలో తీసుకెళ్ళి పాఠశాలలో చీరను మార్చుకొని పిల్లలకి విద్య బుద్దులు నేర్పేది.
యువ జంట దాదాపు అన్ని విభాగాలు నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఆమె పాఠశాలకు వెళ్తున్నపుడు ప్రతిరోజు సావిత్రిబాయి తీవ్రమైన వేధింపుల భరించేది. రాళ్ళు, మట్టి మరియు ధూళి ఆమె పైన వేసేవారు. కానీ సావిత్రిబాయి ఫులే ధైర్యంగా ప్రతిదీ ఎదుర్కొన్నారు.
సావిత్రిబాయి ఫులే గారూ ,బ్రిటిష్ సామ్రాజ్యం లో గుర్తించబడ్డ మొదటి మహిళ ఉపాధ్యాయురాలు ,సావిత్రిబాయి ఫులే ఆధునిక కవిత్వం యొక్క తల్లి. మొదటి కవితా మొదటి సేకరణ - కావ్య ఫూలే - 1854 లో ప్రచురించబడింది.

Go, Get Education
Be self-reliant, be industrious
Work, gather wisdom and riches,
All gets lost without knowledge
We become animal without wisdom,
Sit idle no more, go, get education
End misery of the oppressed and forsaken,
You’ve got a golden chance to learn
So learn and break the chains of caste.
Throw away the Brahman’s scriptures fast.
– Poem by Savitribai Phule
ఆ కాలంలో ప్రజలు అంటరాని వారికీ నీరు అందించడానికి ఇష్టపడలేదు,అంటరానివారి నీడ కూడా మలినాలతో భావించేవారట,
ఆ సమయంలో అంటరాని వారికీ నీరు ఇప్పించడం కోసం ఎంతో కృషి చేసారు, సావిత్రిబాయి ఫులే మరియు మహాత్మా జ్యోతిబాఫులే అణగారిన వారి కోసం వారి ఇల్లు ఎపుడు  తెరిచి ఉండేది,
ఫోటో క్రెడిట్:http://www.mahatmaphule.com/

 సావిత్రిబాయి ఫులే  విద్య సామాజిక మరియు సాంస్కృతిక విలువల పునరుద్ధరణకు అవసరం అని ఆలోచిస్తూ, అణగద్రొక్కబడినవారికి మరియు ముఖ్యంగా మహిళలు విద్యను అందించాలని చొరవ తీసుకున్నారు. మానవ హక్కుల, ఆత్మగౌరవం మరియు ఇతర సామాజిక సమస్యల గురించి మహిళల చైతన్యం పెంచడం కోసం1852 లో మహిళా సేవా మండల్, ప్రారంభించారు. ఆమె ఒక విజయవంతమైన బార్బర్స్ వితంతువులు తలలు క్షౌరము వ్యాప్తిలో పద్ధతికి వ్యతిరేకంగా ముంబై మరియు పూనే లో సమ్మె నిర్వహించడానికి వెళ్ళింది. ఆమె కూడా సత్య Shodhak సమాజ్ లో ఒక కీలక పాత్ర పోషించింది  
1876 ​​1898 కు కరువుల సమయంలో,సావిత్రిబాయి ఫులే ఆమె భర్త తో ధైర్యంగా, కష్టం సమయంలో అధిగమించడానికి అనేక కొత్త మార్గాలను సూచించింది.వారు అనేక ప్రాంతాల్లో ఉచిత ఆహార పంపిణీ ప్రారంభించారు. ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ఆమె సోకిన ఒక plague - ప్రభావిత చైల్డ్ నర్సింగ్ చేస్తున్నప్పుడు ఆమె మరణించారు.
ఇప్పుడున్న చరిత్ర పుస్తకాల లో ఈ నిజమైన సంఘ సంస్కర్త పేరు ఎందుకు లేదు?
సావిత్రిబాయిi ఫులే పుట్టినరోజున 'టీచర్స్ డే' జరపడం వల్ల, మహిళా సాధికారతకు లేదా సమాన-కనీసం అది మహిళల సామాజిక స్థితి కోసం  చూపించడానికి ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తే బాగుంటుంది .
ఎందుకంటే ఈ పుణ్యమూర్తులు దేశ ప్రజలనే తమ బిడ్డలుగా భావించి ,వాళ్లకి పిల్లలు పుట్టకుండా చేసుకోవడానికి సావిత్రి బాయి పులే గారూ చాల భయంకరమైన పసరు మందు తీసుకొన్నారు,కారణం వారికీ పిల్లలు పుడితే  సమాజ సేవ చెయ్యడం లో, స్వార్ధ పూరిత ఆలోచనలు వచ్చేఅవకాశాలకు తావు  ఇవ్వకూడదని ఇలా చేసారు..నిజంగా భారత జాతి కి వీరు అమ్మా-నాన్నల వంటి వారు..