ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Friday, October 31

మనుసున్న మనిషికి సలాం

20:26 Posted by who am i 2 comments
జీవితం లో మనకు కొన్ని సంఘటనలు ఎదురుతుంటాయి,అవి ఎలాగా ఉంటాయంటే మనల్ని ఒక్కసారిగా మార్చేస్తాయి?మనలో ఉండే తప్పు అభిప్రాయాలను సరిచేస్తాయి,అలాంటిదే నా జీవితం లో ను ఒక సంఘటన జరిగింది,
కొన్ని రోజుల క్రితం
అది వేసవి కాలం,బస్సులు రద్దీగా తిరిగే ప్రాంతం,దగ్గర లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చెయ్యలేదు,ఆ ప్రదేశం లో
నేనొక అరటి పండ్లు అమ్మే వ్యక్తిని చూసాను,
అతనికి రోజు మిగిలే ఆదాయం Rs300,అయినప్పటికీ తన అరటిపండ్ల బండిమీద 20 లీ మినరల్ వాటర్ కుండ పెట్టి ,ఉచితంగా నీటిని అందిస్తున్నాడు, అరటి పండ్లు కొనుక్కొనే వారికే నీరు ఇస్తాడేమో అని ఎవరూ అనుకోకుండా ,అందరికి నీరు ఉచితం అని ఒక బోర్డ్ కూడా పెట్టేసాడు.

అంతే ఒక్కసారిగా నేను చేస్తున్న తప్పేమిటో తెలిసింది.
అతనిని చూసే వరకు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే మొదలు నేను వాళ్ళకి సహయం చేసే స్థితి కి చేరుకొని ఆ తరవాత నిమ్మళంగా సహాయం చేయాలి ,అప్పటి వరకు నేను బాగా సంపాదించి ఒక స్థితికి చేరుకోవాలి అనుకునేవాడిని,కాని తనని చూసినాక గాని నాకు అర్ధం కాలేదు,నేను అనుకున్నస్థితి కి చేరినా గాని వాళ్ళకి సహాయం చేస్తానో లేదో ,ఇంకా మంచి స్థితి కి రావాలి అని నా సహాయాన్ని వాయిదా వేసుకోనేవాడినే అని మాత్రం అనిపించింది,ఎందుకంటే ఆరోజు నేను తెలుసుకున్నది ఏమిటంటే సహాయం చెయ్యాలి అని నిజమైన మనసుంటే ముహూర్తాలు, స్థితి గతులు చూసుకోవాల్సిన అవసరం లేదు అని  ,సహాయం చేయ్యలనుకునేవాడు ఎలాగైనా సహయం చేస్తాడు, నాలాగా ఉండడుఅని!
నిజం తెలుసా !
నేను ఎప్పుడు చెడ్డ పనులు చేసేవారినే గమనిస్తున్నానేమో ! కాని మంచి పనులు కుడా చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు,కాని నేను నేను మాత్రమే మంచొన్ని అనే అబద్దపు ముసుగు లో ఉన్నానేమో?అందుకే మంచి పనులు చేసేవరేవ్వరైన కనిపించినా అసలు వాళ్ళని కనీసం గుర్తించను కూడా లేదేమో?కనీసం తినైన నాకు గుర్తుకొచ్చాడు!
ఇలాంటి మనుసున్న మనుషులకు నిజంగా సలాం చేస్తున్నాను

Thursday, October 30

Wednesday, October 29

ఇది ప్రేమా...ప్రేమా...!

ఇది ప్రేమా....! ప్రేమా.......!
అసలు నాది ప్రేమా లేక అట్రాక్షనా ?
తన గురించి ఆలోచిస్తే అది ప్రేమేనా ?
తను నా గురించే ఆలోచించాలి ,నేనే సూపర్  అనుకోవాలి అనుకున్నాను !
అయినా తనతో ఉండాలి అనుకోలేదు ...?
తర్వాత కొన్ని రోజులకి
తను ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తుందని ,తనకి కూడా ఒక రోల్ ఇచ్చిందని తెలిసి ... !
తను తప్పు చేసిందో లేదో తెలియదు ...,
నేను తనని వద్దనుకున్నాను ...,(అంతకు ముందులాగే  తనతో ఉండాలి అనుకోలేదు ...?)
తనలో ప్రేమ బదిలీ కి  నేనే కారణం అంది...! (ఎందుకంటే  తనతో ఉండాలి అనుకోలేదు ...?)కదా ?

అయినా తనని మరచిపోలేకున్నాను ..!
ప్రేమ బదిలీ అనే తప్పు చేసానంది!తను నన్ను మర్చిపోలేనంటుంది ..!
ఇకనుండి ప్రేమని ప్రేమిస్తానంది...... !
అయినా తనతో ఉండాలి అనుకోలేదు ...?
అయినా తనని మరచిపోలేకున్నాను ..! 
కానీ తను ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను...!
ఇది ప్రేమా....! ప్రేమా.......!


Tuesday, October 28

ఇలాగైతే ప్రపంచంలో అందరు అవినీతిపరులే నంటారా?

నేనూ అవినీతి గురించి మాట్లాడతా,
అవినీతి చేసిన వాళ్ళను చీడపురుగుల్లా చూస్తా,
నా భాషలో చెప్పాలంటే వాళ్ళను మన మనస్సు అనే లోకంలో నేను వాళ్ళకి సాంఘిక బహిష్కరణ శిక్ష వేసేస్తా,
వాళ్ళంటే ఒకరకమైన ఏహ్య భావం చూపిస్తా,
అవినీతిపరున్ని(దొరికినోడిని/లేదా నా దగ్గర కూడా అవినీతి చేసినోడిని)నా మనస్సు సంతృప్తి పడే దాకా తిట్టేసుకొని సేద దీరుతా,
ఇలాగ నేనేదో మంచి బాలుడిని అయినట్టు నా ఆక్రోశాన్నినా స్నేహితులు /ఇతరుల దగ్గర వేల్లకక్కుతా!

అలాంటి నేనే..! ఏంటి అలాంటి నేనే...!
ఎం చేస్తానంటే..?
ఒక పుస్తకం ఉంది,దాని Pages 200 మరియు పబ్లిషర్  రేట్ Rs 1000 అనుకుందాం,అపుడు,నేను ఆ పుస్తకం కొనకుండా200 pages ని జిరాక్స్ చేపించాను.అంటే పైరసీ జరిగిందన్న మాట,దానికి నాకు అయిన ఖర్చు Rs 200,
ఇక్కడ అవినీతి ఏంటి అని సందేహమా?
చెప్తాను వినండి,సాదారణంగా ఆ పుస్తకం తయారు కావడానికి ,అందులో ఉన్న విషయం సేకరించిన దానికి వాళ్ళు Rs 1000 ఖరీదు పెట్టారు,వారిని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి పుస్తకాలు వస్తాయి కదా...!
కాని నేను వారికి నష్టం చేసాను కదా?
మన లాభం కోసం మరొకరి నష్టం చెయ్యడమే అవినీతి కదా అండి!
ఇలా ఆలోచించ కూడదా?వీడికి పిచ్చిలేసింది అనుకుంటున్నారా?
ఇలాగైతే ప్రపంచంలో అందరు అవినీతిపరులే నంటారా?
చిన్న చిన్నవి చూసి చూడకుండా వదిలేయ్యలంటారా?
మరి అపరిచితుడెంటి?చిన్న చిన్నవే పెద్ద పెద్దవి అవుతాయి అన్నాడు కదండీ!
ఏమోనండి నాకైతే అవినీతి అంటే కొంచెం కూడా సమజైతలే?
నేను అవినీతి చేసేవాడినో ?కాదో?
అసలు నేనెవరు?

Monday, October 27

ఇన్ని చందమామలు నన్ను ఒక్కక్కటి గా తాకుతున్నాయా ?

04:41 Posted by who am i 2 comments
అపుడు నాకు 8 ఏండ్లు అనుకుంటాను,నాకు ఇంకా గుర్తుంది,
సాయంత్రం 8 గంటలు,మా నాన్న నన్ను తన సైకిల్ మీద ఎక్కించుకొని నేషనల్ హైవే మీదనుండి వెళ్తున్నాము,

ఎలాంటి ట్రాఫిక్ లేదు,నిర్మానుష్యం,చల్లని గాలి,ఎదురుగా అప్పుడప్పుడు  లారీలు, బస్సులు,కార్లు,స్కూటర్ల హెడ్ లైట్ వెలుగుల కాంతి నా మొఖాన్ని,నా కళ్ళను తాకుతుంటే,అది నేను చిమ్మని చీకట్లో చూస్తున్న కదిలే వెలుగుల ఆనందం,ఇన్ని చందమామలు నన్ను ఒక్కక్కటి గా తాకుతున్నాయా ?అనే ఆశ్చర్యం ఒక వైపు,అవి అన్ని నాకోసమే వస్తూ నన్ను పలకరిస్తున్నాయి,నా స్నేహితులేవరికి అలాంటి ఆనందం కలగడం లేదు ,నాకు మాత్రమే ఈ అద్భుతం సొంతం అని ఇంకొక వైపు, ఆ ఆనందం నేను వర్ణించలేక పోతున్నాను,అసలు అలాంటి సుందరమైన వాతావరణం నా కోసమే అంత అందంగా ఆరోజు పుట్టిందా?

ఈ పోస్ట్ రాస్తున్న ఇప్పుడు ఆ రోజు ఎక్కిన సైకిల్ మల్లి ఎక్కినట్టు ఉంది,
నిజమే అసలు ఈ బ్లాగ్ మొదలెట్టడం వల్ల ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయో లేదో తెలియదు కాని నా మనసుని మాత్రం చాలా చాలా రిఫ్రెష్ చేస్తుంది...!ఇంత కంటే పెద్ద లాభం ఇంకా ఏముంటది?
నేను నాతో ఆనందాన్ని పంచుకొంటున్నాను?మనం ఎవరెవరితోనో మన సంతోషాలను పంచుకొంటుంటాం,ఆనందపడుతుంటాం,కాని ఇలా మనల్ని మనం ఒంటరిగా సంతోష పెట్టుకుంటుంటే వస్తున్న కిక్కే వేరబ్బా?ఏమంటారు?

Sunday, October 26

నేను అమ్మాయిని కాదు, అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటారు? అని చెప్పడానికి

అమ్మాయికి తనే హీరో ,
అతని  కోసమే తను,
రోల్ మోడల్ ,
వన్ అండ్ ఓన్లీ వన్ ,
తను కోరుకున్న అబ్బాయి మాత్రమే ఏదైనా తనకోసం చెయ్యగలడు,
తను మాత్రమే చెయ్యగలడు,
ultimate గా ఉండేవాడు,
ఏ సమస్య వచ్చిన ముందుగ మదిలో మెలిగే వాడు,
తను ఎప్పుడూ కోరుకోనేవాడు ఒక్కడే వాడే వీడు అనే నమ్మకాన్ని ఏ అమ్మాయి అయితే ఒక అబ్బాయి లో
కలిగిస్తోందో,,,
ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఎప్పటికీ వదిలిపెట్టడు,

ఒకవేళ పరిస్థితులతో రాజీ పడి వదిలిపెట్టినా ,
ఆ అమ్మాయి ని వదిలిపెట్టినందుకు ఖచ్చితంగా బాధపడతాడు...!


ఎందుకంటే మనుషులందరికీ పోసేసివ్ నెస్ ఉంటుంది...!
తనని ఇష్ట పడే వారు అలాగే ఉండాలి అని కోరుకుంటారు..!

అమ్మాయిలు కూడా ఇలాగె ఆలోచిస్తారు అనుకుంటాను..!
కాని అబ్బాయిలు పైకి చెప్పినా చెప్పకపోయినా ఇదే కోరుకుంటారు..!

ఏదేమైనా నేను అమ్మాయిని కాదు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటారు? అని చెప్పడానికి

మీకెవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్...


Saturday, October 25

నాతో ఉన్న నేను...., నేను కానా?

      ఉన్నాననుకొనే  నేను                                      నిజానికి నేను
నాకు ప్రేమ అంటే తెలుసు
నాకు ఇవ్వడం తెలుసు
నాకు కోపం లేదు
నేను మంచోన్ని,
లంచం అంటే నేరం అంటాను
స్వార్ధం లేని వాడిని
దయ కలవాడిని
మనసు కలవాడిని
అహింస అంటాను
నేను ఒకటి చెప్తాను

ద్వేషిస్తాను
నాకేంటి లాభం అనుకొంటాను
కోప్పడతాను
చెడ్డ పనులు చేస్తాను
ఎంకరేజ్ చేస్తాను
నాకోసమే బ్రతుకుతాను
నిర్దాక్షిణ్యంగా ఉంటాను
మానవత్వం చూపించను
హింస చేస్తూ ఉంటాను
మరొకటి చేస్తాను
అంటే నేను నేను కానా?
నాతో నేను లేకుండా నాలో లేని మంచిని ఉన్నట్టు నటిస్తున్నానా?
నన్నెవరైనా మంచి వాడు కాదు అంటే ఎందుకు నాకు ఉక్రోశం?
నేను మంచి వాణ్ణి కాదు అని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాను?
చెడ్డ పనులుచేస్తూ చెడ్డ వాణ్ణి కాదు అని ఎందుకు ఒప్పుకోను?
కనీసం ఎందుకు మంచిగా ఉండలేక పోతున్నాను?
అసలు ఇంతకీ నేనెవరు?

Thursday, October 23

Wednesday, October 22

కొంత మంది మనుషుల్లారా?అందరికీ నష్టం...!మీకు కుడా!

కొంత మంది మనుషుల్లారా?
కల్తీ ఎందుకు చేస్తున్నారు?

పప్పు లో,ఉప్పులో
పూలల్లో,పండ్లల్లో ,పసుపు లో,కారం లో,మిరం లో,చెక్కర లో
బియ్యం లో ,సగ్గు బియ్యంలో
తినే రవ్వలో
పాలల్లో,నీళ్ళ లో,నూనే లో
చింత పండులో,ఔషదం లో ,
వస్తువులలో
మనుషుల్లో,మనస్సుల్లో
భావంలో ,కావ్యం లో
గీతం లో,సంగీతంలో
బంధం లో ,అనుబంధంలో...ఒకటేమిటి అన్నిట్లో కల్తీ...!
మనసుల్లో కల్తీ ఉంటే ఉన్నోడీకే నష్టం
కానీ ఆహారపదార్తాల్లో కల్తీ వల్ల అందరికీ నష్టం...!మీకు కుడా!
(దయ చేసి డబ్బుల కోసం కల్తీ లు చెయ్యకండి,డబ్బులు సంపాదించాలంటే చాలా మంచి మార్గాలున్నాయి)Tuesday, October 21

నేను ఒంటరిగా ఉన్నానా ?లేనా?

నేను ఎప్పుడూ ఒంటరిని కాను ....!!
ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుండి
వారికీ ఇష్టమున్నా లేకపోయినా-ఎవరో ఒకరితో,
వారి అవసరం తీరే వరకు-వారి కోసమో,
నా అవసరం తీరే వరకు-నా కోసమో,
ఎదో అలా ఉండాలని-దేని కోసమో,
నా సోది వినడానికి-కావాలనో,
నాకు దొరికింది వాళ్ళతో పంచుకోవద్దని-వద్దనో,
మొత్తం మీద నా కొరకు,నా సంతోషం కొరకు,
వాళ్ళు నాతో ఉండాలని అనుకుంటాను!ఉంచుకుంటాను!!
నేనెలాగో వాళ్ళతో ఉండనే ఉంటాను!

మరి నేనెపుడు ఒంటరిగా ఉన్నాను?
అసలు ఒంటరిగా లేను...
ఉన్నా నేను ఒంటరి ని అని అనుకోను.....

ఎందుకంటే.... "ఒంటరితనం అంటే నాకు భయం"
ఎందుకంటే ...."ఒంటరిగా ఉంటే నన్ను సంతోషంగా ఉన్చేదేవరు?"

Monday, October 20

తినడం నా బాధ్యత,పని చేయడం ఆడవాళ్ళ హక్కు

నేను ఇలాంటి ప్రపంచం లోనే పెరిగాను,
మా అక్క నే పాత్రలు కడగాలి,మా చెల్లెనే నీళ్ళు పట్టాలి,
వాళ్ళే ఊడవాలి,వాళ్ళే అన్ని పనులు చేయాలి,
ఏదైనా వంటకం చేయాలి అంటే  మా అమ్మ నన్ను ద్రుష్టి లో పెట్టుకొని వండేది,
కోడిని కోస్తే నాకోసం స్పెషల్ ముక్కలు,నాకోసం కొసిరి కొసిరి వడ్డనలు,
ఆడ పిల్ల అంటే ఆమడ దూరంగా ఉంచే సమాజంలో,

వాళ్ళ పైన వివక్ష,పాపం వాళ్ళు కూడా మేము ఇలాగే ఉండాలి అనుకునేవారేమో,
అందుకే  ఎప్పుడూ కనీసం వాళ్ళని వాళ్ళు కూడా ప్రశ్నించుకోనేవారు కాదేమో?
ఇందులోనే సంతోషం వెదుక్కునేవారేమో?,
లడ్డులు నాన్న గారు తెస్తే
లడ్డు కావాలా నాయన అంటే నాకు రెండు లడ్డూలు వాళ్ళకు చెరొకటి,
అందుకేనేమో ఇప్పటికి కూడా  నాకు అన్నం  వడ్డించుకోవడం నా పని కాదు అనుకుంటున్నాను?

అలాంటిది, గోరుముద్దలతోనే చెప్పారు తినడం నా బాధ్యత  అని,పని చేయడం ఆడవాళ్ళ హక్కు
-----హక్కు కరెక్టే గదా!


Sunday, October 19

మనస్సాక్షి నాతో ఇలా అంటుందేమిటబ్బా?నేను అద్దాన్ని
నా ముందు నిలబడు!
నిన్ను చూపిస్తాను
నా వద్దకు వచ్చే ముందు నీ కళ్ళజోడు తీసి రా
నీ నమ్మకాలు,అభిప్రాయాలు,సంతృప్తి ఉంటే?
నిన్ను నిన్ను గా చూపలేను
నన్ను ముక్కలు చేసినా నువ్వేంటో నిన్ను చూపిస్తాను!

కాని నీ ఆనందం కోసం నిన్ను మార్చి చూపించను!
ధైర్యం ఉంటే రా?

Saturday, October 18

ఆత్మ సంతృప్తి లో నేను ఇరుక్కున్నాను

05:19 Posted by who am i No comments
సంతృప్తి చెందడం మానవ నైజం,

తప్పు చేసిన వాడు తప్పును ఒప్పుగా అనుకొని,

తప్పు చేయని వాడు తప్పుని తప్పు గా అనుకొని,

సంతృప్తి లేకుండా భాదపడే  వాడెవ్వడు?ఒక చోట ఒకటి తప్పు ,మరో చోట అదే ఒప్పు!

తప్పొప్పుల మధ్య నాది తప్పా లేక ఒప్పా?

అది తప్పయితే ,నేనొక్కడినే తప్పులు చేయడం లేదని,

అది ఒప్పయితే,నేనెలాంటి తప్పులు చేయడం లేదని,

నేను కూడా సంతృప్తి  పొందుతాను, :-)


Thursday, October 16

నాది మంచితనమా?

08:32 Posted by who am i 2 comments
అసలు నేను మంచోన్నేనా? అనే డౌట్ వస్తోంది,నేను నిజంగా మంచోన్ని అయితే అందరితో మంచిగానే ఉండాలి కదా?నాకిష్టమైన వాళ్ళతో స్నేహంగా ప్రేమగా ఉంటున్నాను ,నాకు నచ్చని వాళ్ళతో ఉండడం లేదు,అసలు నాకు మనుషులు కొందరు ఇష్టంగా కొందరు అయిష్టం గా ఎందుకుంటున్నాను?అంటే నాకు ఉపయోగపడేవాళ్ళు,ఉపయోగపడబోయే వాళ్ళు,లేదా ఉపయోగ పడుతున్నవాళ్ళు అయితే ఇష్టం ఏమో,ఉపయోగపడని వాళ్ళని నేనెందుకు ఇష్టపడాలి కదా,అందుకే నాకు వాళ్ళు అంటే ఇష్టం లేదు,అంటే నేను మంచోన్నే ,నాకు ఇష్టమైన వాళ్ళతో నే మంచోని గా ఉంటాను,
అంటే నేను మంచోన్ని కాదంటారా?మీరెవరైనా ఎలాగైనా ఏమైనా అనుకున్నానేను మంచోన్నే
ఎహే నేను మంచోన్నే అనుకుంటున్నాను,కనుక నేను మంచోన్నే

Tuesday, October 14

లంచమా నా దగ్గరికి ఎందుకు రావు?

09:44 Posted by who am i 2 comments
లంచం తీసుకోనేవాడు ఒకడు...లంచం తీసుకొననివాడొకడు...
వీడికి హంగులు ఆర్భాటాలు.... వీడికి హంగులు ఆర్భాటాలు కల్ల...
వీడి కొడుకు అమెరికా లో...  వీడి కొడుకు అంబర్పేటలో...
డబ్బుమయమైన ప్రపంచం లో
వీడికే గౌరవం....
ప్రపంచాలు తిరిగేవాడు వీడు...
ఉన్న లోకం లోనే బావి లో కప్పలా నేను?
ఇలాంటి పరిస్థితిలో లంచమా నువ్వు నా దగ్గరికి ఎందుకు రావు?అనిపిస్తోంది
అసలు నేనెందుకిలా తప్పుగా ఆలోచిస్తున్నాను?

నేనెవరు....?

Monday, October 13

హోం వర్క్ అంటే నాకు భయం

10:29 Posted by who am i No comments
నాకు గుర్తుంది నేను ఒకటవ తరగతి చదువుతున్నాను..

అపుడు హోంవర్క్ కోసం డబ్బాల కాపీ (చెక్స్ బుక్) ఉండేది.

ఒకరోజు అది రాస్తున్నపుడు తప్పు గా రాసాను అప్పుడు ఉమ్మి పెట్టి మలపాలని చూసాను

అంతే ఒక డబ్బా చినిగి పోయింది...

అపుడు నాకెంత భయమేసిందో తెలుసా....

ఎంతంటే అలాగే ఏడుస్తూ కూర్చున్నాను...

అపుడు మా నాన్న గారు వచ్చి ఎం కాదు ఇంకొకటి పెట్టిస్తాను అందులో రాయు అన్నారు...

అమ్మో ఇంకేమన్నా ఉందా టీచర్ కి తెలిస్తే ...కొంప మునిగి పోద్ది

వద్దు అన్నాను,అపుడు మా నాన్న గారు నాకు చాల హెల్ప్ చేసారు...

ఎం చేసారంటే ఏదైతే చినిగిన డబ్బ్బ ఉంటదో దాని వెనక నుండి ఇంకో పేపర్ కతిరించి అతికిన్చేసాడు...

అలాగా ఆరోజు నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది..

అసలు ఇది కూడా ఒక పోస్టా అనుకుంటే నేనేం చెయ్యలేను ,ఆ టెన్షన్ ఎంత విలువైనదో మీకు ఎవ్వరికి తెలియదు..

అందుకే ఇప్పటి వరకు గుర్తుండి పోయింది

Sunday, October 12

ప్రేమ అంటే:

06:45 Posted by who am i No comments
నిన్నేవరైనా ప్రేమిస్తున్నా నని చెప్తే...
అడుగు ఎందుకు అని...
ఒకవేళ తను కారణం లేని ప్రేమ అని చెపితే...
వాళ్ళు నిన్ను ఎప్పుడైనా వదిలేస్తారు...
వాళ్ళు గాని ఏదైనా కారణం చెప్తే...
కారణం ఉన్నన్ని రోజులు ....
వాళ్ళు నీతో ఉంటారు..
కారణం స్వార్ధమైతే కారణం కాలంతో పాటు కరిగిపోతుంది...

లేకపోతే కలకాలం నీతోనే ఉంటుంది

Wednesday, October 8

నాకు మానవత్వం ఉందా?

08:18 Posted by who am i 1 comment
నేను నిన్న బస్స్టాండ్ కి వెళ్ళడం జరిగింది....

అక్కడ దాదాపు ప్రతిసారి కనిపించే దృశ్యాలే  బిక్షగాళ్ళు రక రకాలుగా  అడుక్కుంటూ ఉంటారు...

కాని నా చూపు ఒకావిడ వైపుకు వెళ్ళింది...

ఆవిడ ని చూస్తుంటే పేదరికం లో మగ్గి  ఉన్న కుటుంబమేమో...

ఆవిడ తన లగెజి పక్కనే

ప్లాట్ ఫారం పైననే ఒళ్ళు మర్చి నిద్రపోయి పడుకుంది...(అలసి పోయిందేమో రాత్రి నిద్రపోలేదేమో)

అసలు తనకు తన కుటుంబానికి ఇల్లు కూడా లేదేమో..

నేను ఇంతకన్నా దరిద్రం లో బ్రతికే వాళ్ళని చూసాను...

కాని ఈవిడే నా మనసుని ఆలోచించేలా ఎందుకు చేసింది...

నేను  ఇంట్లో ఫ్యాన్ లేకున్నా ...

దుప్పటి లేకున్నా...

మెత్తని పరుపు లేకున్నా ....

ఎదో కోల్పోయానని బాధపడ్తూ...

నిద్రను దూరం చేసుకున్టానే....

ఈవిడిలా ఎందుకుంది?

ఇలాంటి వాల్ల దుస్థితికి  నేను ఒక కారణమే నా!!!


(ఎందుకంటే నేను అవినీతిపరున్నేమో,

క్యూ లైన్ లో నిలబడలేని వాణ్ని,

నా పని జరగడం కోసం ఎంతో కొంత మొత్తం ఇచ్చుకొనేవాడిని

అవసరమైతే నా పరపతి ని ఉపయోగించి

అడ్డదారులు తోక్కేవాడిని

 అవకాశం ఉంటె లక్ష కోట్లు తీసుకుంటానేమో,,)

ఇపుడు మాత్రం బుద్దిమంతుడిలా

ఈవిడకి నేను మాత్రం ఏం చెయ్యగలను? "పాపం ఆవిడ"

అనే నా మానవత్వాన్ని నా మనసుకు,

చెప్పుకునే నాకు మానవత్వం ఉందా?

Monday, October 6

అసలు ప్రేమ ఎందుకిలా కనిపిస్తోంది?

04:06 Posted by who am i No comments
                                                       అసలు ప్రేమ ఎందుకిలా కనిపిస్తోంది?

                                                                  నేను  ప్రేమించాలి అనుకుంటే అందంగా,                                                                 మా చెల్లి ప్రేమిస్తోందని తెలిసాక కోపంగా,

                                                      అసలు ప్రేమ ఎందుకిలా కనిపిస్తోంది?