ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Monday, September 29

ఎందుకు స్త్రీలకు రిజర్వేషన్?

23:30 Posted by who am i No comments
ఈ మధ్య కాలం లో స్థానిక సంస్థలకు ఎన్నికల్లో స్త్రీలకు రిజర్వేషన్ ఇచ్చారు,
కాని వారు పదవిలో అలంకారం గా మాత్రమే ఉంటున్నారు,అసలు పని అంత వారి వెనుక ఉన్న అన్నలో, నాన్నలో,భర్తలో చేస్తున్నారనుకుంటాను,

ఇది 100% ఇలాగే జరగడo లేదు,

కానీ ఎక్కువ శాతం వాళ్ళు అలంకారంగానే ఉంటున్నారు?


అసలు రిజర్వేషన్ పెట్టిన లక్ష్యం ఎందుకు నెరవేరడం లేదు?

నెరవేరాలంటే ఎం చేయాలి?
సమన్యాయం ఎలాజరుగుతుంది?

Sunday, September 28

నాకు తెలిసిన నేను:

23:11 Posted by who am i No comments
అంటే అదే నాకు ఉహ తెలిసినప్పుడు ప్రొద్దున నన్ను లేపడానికి సూర్యుడు చాల తొందరగా ఉదయించేవాడు,అదేంటో నన్ను నేను మర్చిపోయిన లోకం నుండి నేనెంటో తెలిసే లోకం లోకి రావాలంటే చాలా బద్దకంగా ఉండేది.ప్రతిరోజు స్కూల్ కెల్లడం,ఇంటికి రావడం ,బుక్స్ పక్కకు పడెయ్యడం,ఇంటి ముందున్న రోడ్ పైన గ్యాంగ్ తో ఆటలు ఆడడం(రేస్,గిల్లిదండ,టైర్ నడపడం,ముట్టిచుకొనడం,etc)పొద్దు పోయే దాక ఆడి ఆడి అలిసిపోయి ఇంటికోచ్చి తినేసి పడుకోవడం,ఇది స్కూల్ నాస్కూల్ జీవితం రొటీన్,కాని అది రొటీన్ కాదు అని ఇప్పుడు అర్ధమైనది,ఎందుకంటే 

"సీతాకోక చిలుకకు తెలుసునా అది స్వేచ్చగా ఉందని,స్వేచ్చ అంటే ఏమిటో తెలియనపుడు,"
లాంటిదే నా జీవితం 
అని పెరుగుతున్న కొద్ది తెలిసింది!

na chinnapudu?

05:55 Posted by who am i No comments
ఒకసారి ఏమైందంటే నేను చిన్నపుడు 1వ తరగతి అనుకుంటాను,ఒక బటాని గింజను భూమిలో పెట్టాను ఎందుకో తెలుసా !
అది ఆటన బిళ్ళ (50np) అవుతుందని,
నాకు అపుడే ఎన్ని తెలివితేటలో కదా అని ఇప్పుడు గుర్తు వచ్చి నవ్వు వచ్చింది,అంతే కాదు మా ఇంటిముందు డాంబర్ రోడ్ ఉండేది,బస్సు టైర్స్ పంచర్ చెయ్యాలని రోడ్ వెడల్పు ఇసుక పోసి దాంట్లో ముళ్ళులు పెట్టేవాణ్ణి,
పంచర్ ఎందుకు చేయలనుకునేవాడినో,
సరదా కోసమే అనుకుంటాను,
ఇదొక రకమైన ఆనందమా?
అంటే ఈ ఆలోచన కేవలం నాదేనా ఇంకో స్నేహితునిదా గుర్తులేదు,
కాని అలా చేయడం కర్రెక్టేనా?అపుడు ఇపుడు అలాంటి ఆనందం నాతో పాటు పెరిగి ఉంటుందా?
మరి ఇప్పుడు అలానష్టం కలిగించే పనులు చెయ్యడం లేదే?
అంటే నేను మారిపోయనా?
లేదా మంచివాడిగా నటిస్తున్నానా?
లేదా కవర్ చేస్తూ ఉంటున్నానా?

అసలు నేను ఎవరు?


Tuesday, September 23

nenu kottha

10:00 Posted by who am i No comments
ఈ బ్లాగ్ నాకే అంకితం
ఎందుకంటే ఇది నా ఆనందం నా భావాలూ నా ప్రతిస్పందనలు అన్ని నాకు నచ్చినట్టు నేను నా కోసం రాసుకునేది కాబట్టి,,,,,,,,
నా కళ్ళతో చూచే నా ప్రపంచం ఇది,ఇందులో నా ఆనందం మాత్రమే ఉంటుంది,
ప్రతి ఒక్కరి జీవితం లో వాళ్ళకు ఇలాంటి ప్రపంచం ఉండొచ్చు,నేను మాత్రం నా జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటున్నాను
నేను రచయిత ,కవి ,బస్ డ్రైవర్ క౦డాక్టర్,టీచర్ ,డైరెక్టర్ రక రకాలుగా మారుతూ ఉంటాను
ఎందుకంటే అవి చిన్నపుడు నేను అవుదామనుకొనే వాడిని
ఎదో ఒకటి రాయాలి ఎం రాయాలి అనుకోన్నపుడే నా ప్రపంచం గురించి రాస్తే ఎలాగుంటుంది అనే ఆలోచనే నా బ్లాగ్ నాకే అంకితం

ఆనంద విషయాలనే ఎందుకు రాస్తున్నాను అంటే ఎవరికైనా నచ్చేవి ఇవే కాబట్టి,నాకు ఆనందం చదివితే మీకు ఆనందం కలగాలని మొదలు పెడ్తున్నాను
వాస్తవంగా ఆనందం కాని విషయాలు రాయలంటే నాకు భయం
అయినాఅది మనకి ఇపుడు అనవసరం

బీ హ్యాపీ హ్యాపీ ఆల్వేస్