ప్రాక్టికల్ గా అలోచించనపుడు నేనెలాగ ఉంటాను ? దానికోసం మొత్తం మీద నేను వేసుకున్న ముసుగు తీసేసానుఇక్కడ! అసలు నేను అనుకునే వాడే లేని లోకంలో నా అంతరంగంలోని చైతన్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం

Wednesday, December 31

Tuesday, December 30

ప్రేమశాతం:నా మొదటి ప్రేమ...!ఇది కుడా ప్రేమేనా?

ప్రేమ శాతం:serial part 14
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని నేను...
బాయ్స్ బడి లో చదివే నేను ...10th క్లాసు లో private tution కి వెళ్ళాల్సి వచ్చింది ....
ఎలాగైనా మనమే ముందు కదా చదువులో...
అయిన ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా tution పెట్టించాడు మా నాన్న గారూ...
ఆ tution లో ఒకే ఒక అమ్మాయి వచ్చేది...
చూడడానికి బాగానే ఉంది...
నచ్చేసింది..అసలు నచ్చడం అంటే ఏమిటి
కాని ఎలా చెప్తాము?ఏమని చెప్పాలి ?
అసలు ఎందుకు నచ్చింది...?అసలు నచ్చాల్సిన అవసరం ఏమిటి ?
నా దృష్టి ఆమె వైపుకు పదే పదే ఎందుకు వెళ్తోంది...?
అనేవి  అంటే ఏమిటో తెలియని "పాపం పసివాడి"ని!
అప్పుడు ఇంత సినిమా knowledge లేదు నాకు ..
టీవీ మొత్తం కార్టూన్స్ తో నిండి పోయేది ..నా బుర్ర మొత్తం కూడా కార్టూన్సే మరి..!
ఇప్పడు ఆలోచించి  post రాస్తుంటే బలే ఫన్నీ గా అనిపిస్తోంది...


ఆ అమ్మాయి కూడా బాగానే చదివేది..
అపుడు ఏదైనా లెక్క ఇచ్చి చెయ్యమంటే ,
నేను గాని లేదా తను గాని అందరికంటే ముందుగా మా గురువు గారిదగ్గరికి  వెళ్లి లెక్కను చేసి చూపించే వాళ్ళం..
తను ఎప్పుడైనా నా కన్నా ముందు గా లెక్కను చేసి మా గురువు గారి దగ్గరికి వెళ్తే ...!
అప్పుడు చూడు నా మనసు కు కలిగే అవమానం...?
ఇలా లాభం లేదు అని ఇంకా తెలివిని పెంచాలి...
ఎలాగా అని అలోచించి,మా అక్కయ్య 10th క్లాసు పాత note books తీసి ఇంకా చదవడం మొదలెట్టాను..!
అలా ఆ అమ్మాయి ద్రుష్టి లో నేనో "స్పెషల్ "అని అనిపించుకోవాలని..
ప్రయత్నాలు ...కాని ఈ ప్రయత్నాలు ఎందుకో కూడా తెలియని పరిస్థితి అప్పుడు!
అవును ఇంతకి ఆ ప్రయత్నాలు ఎందుకు ?ఇప్పటికి కూడా సరిగా అర్ధమవడం లేదు..?
అంతే కాని ఇంకా ఎక్కువ చదువుకొని బాగు పడదామని కాదు...!
నాకెంతో ఇష్టమైన క్రికెట్ ఆట ఆడేటపుడు కూడా  algebra సూత్రాలను కూడా బట్టి పెట్టేవాడిని?మనసులో...!
ఇలా నా speciality ని తెలియ చేద్దామని ప్రయత్నిస్తున్నాను...
ఆ tution మొదలై  మూడు రోజులైంది...
నాలుగో రోజు నుంచి ఆ అమ్మాయి రావడం మానేసింది...
ఎందుకంటే పాపం తను ఒక్కతే కదా ?నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా?
అలాగా నేను మొట్ట మొదటి సారి సైట్ కొట్టిన అమ్మాయి వెళ్ళిపోయింది...!
ఏంటో నా ప్రేమ శాతం లో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది...!
దీన్ని ప్రేమ అంటారా ?ఇది కూడా ప్రేమేనా?
ప్రేమంటే అమ్మాయి పైనే కలుగుతుందా?
తెలుసుకొవాలంటేకింది లింక్ నొక్కండి
ఒక అమ్మాయి అబ్బాయి మధ్య చిగురించేది ప్రేమనా ?

Sunday, December 28

ఇతరుల బాధ నా నవ్వుకు కారణం కాకూడదు!

06:30 Posted by who am i 2 comments
నా బ్లాగ్ లో కొత్త శీర్షిక:అద్భుతం ప్రతి ఆదివారం  కనబడబోతోంది..

దీంట్లో నమ్మశక్యం కాని నిజాలను /అద్భుతమైన విషయాలను ప్రతి ఆదివారం ఉంచాలని భావిస్తున్నాను..
మీకు తెలిసిన ఏవైన అద్భుతమనిపించే విషయాలు ..
నాకు srinosys1@gmail.comమెయిల్ చెయ్యగలరు ..
వాటిని ప్రతి ఆదివారం అద్భుతం అనే శీర్షిక లో ఇవ్వడం జరుగుతుంది...

ఈ వారం అద్భుతం లో:
ఒక అధ్బుతమైన కొటేషన్ ఇవ్వడం జరిగింది

నీకు చాలా బాధ కలిగినప్పుడు ఒక్క క్షణం ఆగు....
నీ చుట్టూ అందమైన ప్రపంచం ఉందని అర్ధమౌతుంది

నా బాధకు ఇతరుల నవ్వు కారణం కావచ్చు కాని 
ఇతరుల బాధకు నా నవ్వు కారణం కాదు!
......
Anonymous గారి సూచన వల్ల సరిచేయనైనది 
నా బాధ ఇతరుల  నవ్వుకు కారణం కావచ్చు కాని
ఇతరుల బాధ  నా నవ్వుకు కారణం కాదు!


చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్యమాధ్యమం. అతను విభిన్నమైన కళాకారుడు. అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్వోత్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ, నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు. ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత , చక్కని రచయిత, చక్కని గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు. అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఛార్లీ చాప్లిన్ దయార్థ్ర హృదయుడు. అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు.
copied from wikipeia


Friday, December 26

ప్రేమ శాతం:ఒక అమ్మాయి అబ్బాయి మధ్య చిగురించేది ప్రేమనా ?

ప్రేమ శాతం:serial
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....

ప్రేమించే ప్రేమవో ?ఊహల్లో 'కల'వో? అసలు

ఈ ప్రేమ అంటే ఏమిటి?


ఒక తల్లి తన బిడ్డకి చూపించే అనురాగం ప్రేమనా?
అమ్మను ఆరాదించడంప్రేమనా?

ఒక నాన్న తన పిల్లల పై ప్రేమించే బాధ్యత ప్రేమనా?
నాన్నను అభిమానించడం ప్రేమనా?

ఒక అమ్మాయి అబ్బాయి మధ్య చిగురించేది ప్రేమనా ?
అమ్మాయి అందం ప్రేమనా?
అబ్బాయి చురుకుదనం ప్రేమనా?

రోగం వచ్చినవాడికి సపర్యలు చెయ్యడం ప్రేమనా?

డబ్బులు లేని పేద వారికి సహాయం చెయ్యడం ప్రేమనా?

మంచి చెయ్యాలనుకోవడం ప్రేమనా?మంచి చెయ్యడం ప్రేమనా?

భార్యాభర్తల బందం ప్రేమనా?

నీకోసం బ్రతకడం ప్రేమనా ?

పక్కవాళ్ళ కోసం బ్రతకడం ప్రేమనా?  

ప్రేమ ఇన్ని రకాలా?లేక వీటన్నిటిలో  ప్రేమ ఒక్కటేనా?

ఈ ప్రేమ ఎప్పుడు ఎందుకు తరుగుతుంది...?
ఈ ప్రేమ ఎప్పుడు ఎందుకు పెరుగుతుంది...?

ప్రేమించడం ముఖ్యమా?ప్రేమను తీసుకోవడం ముఖ్యమా?

Thursday, December 25

ప్రేమశాతం :ప్రేమ లో పడ్డ న్యూటన్ మూడు సూత్రాలు

 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
ప్రపంచం మొత్తం న్యూటన్ 3 సూత్రాల  మీద ఆధారపడి ఉంటుందేమో ...కాబోలు
ప్రేమ కూడా న్యూటన్ సూత్రాల మీదే ఆధారపడి ఉందా? అని అనుమానమొచ్చి,
న్యూటన్ సూత్రాలలో ప్రేమ ను ప్రతిక్షేపించాను..
అప్పుడు కింది చూపెట్టిన  ఫలితాలు వచ్చాయి..మొదటి సూత్రం:

బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను ,నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది”.ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు

ఒక వస్తువు ఉన్న స్థితిలోనే ఉంటుంది దాన్ని కదిలించనంతవరకు...
అలాగే ప్రేమ ఇలాగ ఉంటుందని తెల్సుకుంటే(బాహ్య బలం ప్రయోగం జరిగింది)
నాలాంటి వాళ్ళలో ప్రేమని  తట్టి లేపినా లేవలేని సోమరిని కదా!అపుడు ప్రేమ లో చలనం మొదలవుతుంది. 
అలాగే స్వార్ధ స్థితిలో ఉన్న మనసు స్వార్ద స్తిలోనే ఉంటుంది.దానికి కూడా బాహ్య బలం ప్రయోగం చెయ్యాలి.
అసలు ఇక్కడ నా మనసు కనీసం కదులుతుందా?ఏమో నేను ప్రేమ గా ఉండాలని అనుకొంటాను..
కాని ప్రేమ గా ఉండలేక పోతున్నాను,బాహ్య బలం ప్రయోగించినా గాని!

రెండవ సూత్రం:


ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది .   మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది

ఒక మనిషి ప్రేమ లోని మార్పు ,అతనికి  ఇతరుల నుండి వచ్చే అంశాలకి అనుపాతముగా ఉంటుంది.మరియు ఆ ప్రేమ  వచ్చే అంశాల దిశలోనే ఉంటుంది.

మూడవ సూత్రం:


“ప్రతిచర్యకు దానికి సమానమైన ,వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది.”

చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుంది.
ప్రేమ కు ప్రతి గా కచ్చితంగా ప్రేమ ను కోరుకుంటాను...నేను ప్రేమించేదే ప్రేమను తీసుకోవడానికి...ప్రేమ ఇవ్వక పోతే అస్సలు ప్రేమించను..

ఇలాగ నా ప్రేమ లేని ప్రేమ ప్రేమ ఉన్నట్టు నాకు ప్రేమను చూపెడుతోంది


న్యూటన్ చెప్పినట్టు 3 సూత్రాలలో మొదటి సూత్రం నా లోని ప్రేమకు వర్తించడం లేదు ,జడత్వం కంటే జిడ్డు పదార్తమేదో నన్ను బయటపడనివటం లేదు అని అర్ధమైంది...
ఆ జిడ్డుపదార్థమెంటో కాస్త మీరు చెప్తారా? NEXT PART

Tuesday, December 23

ప్రేమశాతం:నేనొక కుల పిచ్చోన్ని!తెలుసా?

ప్రేమశాతం:serial
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6 7 8  9 10
ఇది ఎప్పుడో పూర్వ కాలం లో
నేను చిన్నపుడు స్కూల్ లో ఉన్నపుడు నాకు కృష్ణ అనే స్నేహితుడుండే వాడు...
అదేంటి ఏదైనా ఇవ్వాలంటే వాడు ముందేమైన ఇచ్చాడా? అనే నాలాంటి వాడికి స్నేహితుడు కూడా ఉంటాడా ?
అని అనుకోకండేం?
ఎందుకంటే వాడు ఇచ్చాడు ...
ఒక రోజు నేను ఆడుకుంటుంటే నాకు దెబ్బ తగిలితే వాడె నాకు ముందు గా first aid చేసాడు ..అలా నాకు వాడు ఫ్రెండ్ అయ్యాడు ...బాగా నాకన్నా వాడికే ఎక్కువ మార్కులు వస్తుంటాయి..అందుకే ఎందుకైనా పనికొస్తాడు లే
అనుకోని..
అలాగా వాడితో స్కూల్ లో ఎక్కువగా ఉండేవాడిని...!అన్నమాట!
ఇలాగ నా స్నేహం మొగ్గలా చిగురించే సమయం ...
వాడి ఇల్లు.. మా ఇల్లు..దాటిన తర్వాత ఉంటుంది.
ఒక రోజు ఆదివారం...
వాడిని మా ఇంటికి పిలిచాను ...ఆడుకోవడానికి...
వాడితో నేను ఆడు కుంటున్నాను...పాపం వాడికి మధ్యలో దాహం వేసింది...
నేను లోపలికి వెళ్లి నీళ్ళు ఇమ్మని అడిగాను...అమ్మ ఇచ్చింది.
ఇదంతా గమనించిన మా తాతయ్య ...నీళ్ళు  ఇవ్వడం చూసాడు 
అంతే కాకుండా మనకన్నా తక్కువ వాడు ,మన కులమా అతనిది? ఆట ఆపెయ్యమని..మరోసారి కృష్ణతో కనపడకూడదని పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాడు,
అదేంటి తక్కువ వాడా? అంటే?....
పాపం కృష్ణ గాడు మంచోడే కదా ఎందుకు ఇలా తిడుతున్నాడు నన్ను?
మా తాతకేమన్నా పిచ్చా?వాళ్ళ ఫ్రెండ్స్ తో తను మాట్లాడుకోవచ్చు ?పేకాటలు ఆడుకోవచ్చు ?
నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవద్దా?అని తాత ని అడిగితే

తను చెప్పాడు ...కృష్ణ వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు...వాళ్ళతో తిరిగితే మనకి ఇస్తారా?
వాళ్ళతో కలిసిపోతే వాళ్ళకి మనకి తేడా ఏముంటది?
అని చెప్పాడు...?
అప్పుడు నాకు అర్ధమైంది ఏంటంటే..నేను వాడికంటే గోప్పోన్ని...!  బాగుంది ఈ ఫీలింగ్...
వాడి కన్నా నేను బాగా చదవక పోయినా నేనే గోప్పోన్ని...!మరి..
గొప్పతనాన్ని ఎవరైనా కాదంటారా?ముందే స్వార్ధం లో ఆరితేరిన వాడిని...
కష్టపడకుండా వచ్చే గొప్పతనాన్ని కాలరాస్తానా?
అలాగ నేను కూడా కుల పిచ్చోన్ని అయ్యాను...

ఇందులో నా స్వార్ధం 2 శాతం పాయింట్లు పెరిగింది..ఎందుకంటే basic గా నాకు పక్కవాళ్ళతోనే స్వార్ధం ...ఇప్పుడు మనుషుల్లో కులాల పట్ల కూడా స్వార్ధం పెరిగినట్లయింది  
ప్రేమ 44 శాతం స్వార్ధం 56 శాతం గా మారిపోయింది..

కాని ఇలా అయాచితంగా గొప్పతనం  ఎంజాయ్ చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను...

గొప్పవాడు కావాలంటే గొప్పతనం మనిషి స్వభావం వల్ల ,నడవడిక వల్ల మరియు మంచి ఆలోచనల వల్ల వస్తుంది ..
కాని కులం వల్ల రాదు అని...
ఈ విషయాన్నే పురాతన గ్రంధాలూ చెప్తాయి అంటారు ...పురాతన గ్రంధాలు  చదివే వాళ్ళు?చెప్పే వాళ్ళు?
కాని పాటించేవాళ్ళు...వాళ్ళు కాదేమో ...కేవలం అవి చదవడానికేనేమో?..చెప్పడానికేనేమో...?
లేక పోతే గ్రంధాలు పుట్టి ఇన్నేళ్ళయిన కులాల వల్లనే గొప్పతనం ఎందుకు వస్తుంది చెప్పండి...
                                   
               ఇంత చదువుకున్న నేను కూడా చాల లేట్ గా తెలుసుకున్నాను...
గొప్పతనం నన్ను నా కళ్ళను  అలా కమ్మేసింది మరి...
కుల వ్యవస్థ పోవడానికి హరి గారి కామెంట్ నాకు బాగా నచ్చింది
 ఈ కింది కామెంట్ చూడండి
  1. మత మార్పిడులు వుండాలి. అలాగే కుల మార్పిడులూ వుండాలి. ఎవరికి కావలసిన మతం, కులం వారు స్వీకరించే వెసులుబాటు వుండాలి. అలాగే నాస్తికులకు NOTA మతం, NOTA కులం కూడా వుండాలి. వీటన్నిటిన్నిటినీ నియంత్రించేందుకు కులాల, మతాల రిజిష్ట్రార్ ఆఫీసులు దేశమంటా తెరవాలి!

Monday, December 22

ప్రేమశాతం:మీలో ప్రేమ శాతం లెక్క ఎంతో తెలుసుకోవాలనుందా?

 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2  3  4  5  6  7  8

హలో...! మీకోసం మీలో ప్రేమశాతం మీరే కనుక్కోవడం కోసం కోసం ఒక చిన్న ప్రయత్నం..
ఇది పూర్తి స్థాయి శాతాన్ని తెలుపదు..
కాని ఆలోచింప చేస్తుంది...
సరదాగా ఒక ట్రై చెయ్యండి..జవాబులు నిజాయితిగా చెప్పుకోండి..
నిజాయితిగా అంటే ఒకసారి ఈ link పోస్ట్ ఒకసారి చదవండి...


1)మీరు అందరిని ప్రేమిస్తారా ?లేదా కొందరినే ప్రేమిస్తారా?
అవును /కాదు/కొంచెం
2)మీరు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరు? మీరేనా?
అవును /కాదు/కొంచెం
3)మీ ప్రేమ అందరితో ఒకే రకంగా ఉంటుందా(Ex:వైఫ్ /అమ్మ/నాన్న)?
అవును/కాదు/కొంచెం
4)ప్రేమించడం ఇష్టమా?
అవును/కాదు/కొంచెం
5)ప్రేమకోరుకోవడం ఇష్టమా?
అవును/కాదు/కొంచెం
6)పక్క వారి  ఆనందంమీకు బాగా అనిపిస్తుందా ?
అవును/కాదు/కొంచెం
7)మీకు కోపం వచ్చినప్పుడు కోపం డామినేట్ చేస్తుంది కదా?
అవును/కాదు/కొంచెం
8)మీరు మంచి వారేననుకుంటున్నరేనా?
అవును/కాదు/కొంచెం
9)love at first sightనమ్ముతారా?
అవును/కాదు/కొంచెం
10)మీ ప్రేమ అబద్దం ,ఒక నాటకం,పరిస్థితులను బట్టి మారుతుంది
అవును/కాదు/కొంచెం

జవాబులకోసం

1,3,4,6 ప్రశ్నలకు
అవును -10మార్కులు
కాదు-0 మార్కులు
కొంచెం -5 మార్కులు

2,5,7,8,9,10 ప్రశ్నలకు
అవును -0మార్కులు
కాదు-10మార్కులు
కొంచెం -5 మార్కులు

కామెంట్  చెయ్యండి మీ ప్రేమ శాతం 60 పైన ఉంటె ...

మీరు నిజ జీవితమనే బడి  లో కూడా first class విద్యార్థి అన్నమాట...NEXT POST

Sunday, December 21

కొత్త శీర్షిక:అద్భుతం-తల్లి ఈగ తన పిల్లలనేపుడు చూడదు ..!

00:36 Posted by who am i 2 comments
నా బ్లాగ్ లో కొత్త శీర్షిక:అద్భుతం ప్రతి ఆదివారం  కనబడబోతోంది...
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6 7 8  9

దీంట్లో నమ్మశక్యం కాని నిజాలను ప్రతి ఆదివారం ఉంచాలని భావిస్తున్నాను..
మీకు తెలిసిన ఏవైన అద్భుతమనిపించే విషయాలు ..
నాకు srinosys1@gmail.comమెయిల్ చెయ్యగలరు ..
వాటిని ప్రతి ఆదివారం అద్భుతం అనే శీర్షిక లో ఇవ్వడం జరుగుతుంది...

ఈ వారం అద్భుతం లో:
     కందిరీగ కు  చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపాయం..అందుకే గడ్డిపురుగు మీద పడి ఆ పురుగు చావకుండా 
అచేతనమయ్యే విధంగా ఈ ఈగ కుడుతుంది.అల అచేతనమైన పురుగుకు దగ్గరలో తన గుడ్లను పెట్టె ఆ తల్లి కందిరీగ ఎగిరి పోయి చనిపోతుంది.ఆ గుడ్లలో నుంచి వచ్చిన పిల్లలు దగ్గరలో నున్న ఆ పురుగును కొద్ది కొద్దిగా కొరుక్కు తింటాయి..అంత చేసిన తల్లి ఈగ తన పిల్లలనేపుడు చూడదు ..


  
 ఈ చిన్న ప్రాణులకూ ఈ విచిత్ర ప్రణాళిక ను ఎవరు రూపొందించినట్లు? NEXTPOST

Friday, December 19

ప్రేమశాతం:అమ్మా నన్నెందుకు కొట్టావ్?

 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6 7 8
శీను బాబు ఎందుకు ఏడుస్తున్నావు...
అమ్మ నన్ను కొట్టింది ....
ఏమైంది ?ఎందుకు కొట్టింది...?
ఏమో ఊరికే కొట్టింది..
నువ్వేదో కోతి పని చేసి ఉంటావు కదా?అందుకే కొట్టి ఉంటుంది...!
నేనేం తప్పు చెయ్యలేదు..!అయినా కాని అమ్మ నన్ను కొట్టింది...!
అల్లరిపనులు చెయ్యక పోతే ఎవరైనా కొడతారా?బాబు?
నేను అల్లరి ఏమి చెయ్యలేదు ...
నా బొమ్మ ఎక్కడుంది అని అడగటానికి కిచెన్ లోకి వెళ్ళాను..
వెళ్లి అడిగాను...
అంతే అదే సమయం లో మా అమ్మ చేతిలోని పాల గిన్నె కింద పడి పాలు అన్ని పోయాయి..!
అమ్మకు కోపం వచ్చింది...
నీ వల్లనే పాలు కింద పడి పొయ్యాయి రా...
ఎప్పుడూ ఎదో ఒక గోల చేస్తావు...అని నన్ను కొట్టింది  ...?
ఇలాగ పక్కింటి ఆంటీ తో మాట్లాడుతున్నపుడు ...
అమ్మ వచ్చి నన్ను పట్టుకొని ...
కన్నా ఏడవద్దురా..?నిన్ను అనవసరంగా కొట్టానురా...
ఇంకెప్పుడు కొట్టను..అని చెప్పి తినడానికి ఏవో ఇచ్చి
ఈవెనింగ్ డాడీ తో షికారుకు పంపించింది..
సాదారణంగా డాడీ ఈవెనింగ్ మనల్ని తీసుకెళ్ళడు కదా?
ఇంకేం చాన్సు దొరికింది కదా ...
బోలెడన్ని తినేవి కొనుక్కొని వచ్చేసాను...
పాలు పోయినా గాని మురిపాలు దొరికాయి ..ఆ రోజు నాకుఆరోజు నుంచి పాలు మా అమ్మ తో కింద పడేలా చెయ్యాలని...
 కావాలని కిచెన్ లోకి వెళ్ళినా కాని పాలు కిందపడలేదు...
ఈ సంఘటన లో మా అమ్మకు నాపైన ప్రేమ ఉందా?లేదా?
అంటే కచ్చితంగా ఉంటుంది...
సాదారణంగా అమ్మ మనల్ని ఎప్పుడు ప్రేమిస్తుంది ...
కానీ...
ఎల్ల వేళలా మనకి కంటికి రెప్పలా కాపాడే అమ్మ
ఆ క్షణం లో మన పై ప్రేమ ను ఎందుకు చూపించలేక పోయింది..?
ప్రేమ కూడా ఒక స్థితి లో ఉండక పోవచ్చేమో కదా...

మిగతా వివరాలకోసం ఇది చదవండి ప్రేమ ఎప్పటివరకు ?ఒక కోతి ప్రయోగం :-()  NEXTPOST

Monday, December 15

ప్రేమశాతం:ఎలా ఉంటే నా soul కి soul-mate కనెక్ట్ అవుతుందో...

 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6 7

నా ప్రేమశాతం  serial లో సాంగ్/poetry పెట్టకూడదా?
అందుకే ఈ సాంగ్...మీకోసం...


నాతో నేను ...ఎపుడు ఒంటరిగా..
క్షణక్షణం అనుక్షణం ....

...నిజమైన  soul-mate అంటే ఎవరో తెలియని నేను ...
ఇప్పటి వరకు నా soul-mate కనుక్కోలేక పోయాను...
మీకో విషయం తెలుసా...
అసలు నా లాంటి వాళ్ళు నాకు అసలు నచ్చరు..
కాని నాకు నేనంటే చాలా నచ్చుతాను...
ఎందుకంటే నేనంటే నాకు చాలా చాలా ఇష్టం...
మరి నా లాంటి వాళ్ళు నాకెందుకు నచ్చరు?
అసలు నా soul-mate ఎలా ఉండాలో...
ఎలా ఉంటే నా soul కి soul-mate కనెక్ట్ అవుతుందో...
మనతో ఒకరు ఉండడం కాదు..
సమాజానికి జోడి గా కనపడే ప్రతి ఒక్కరు మన soul కి  కనెక్ట్ అవుతారా?
అసలు నా లాంటి స్వార్ద పరునికి నిజమైన soul-mate దొరుకుతుందా?
అసలు నిజంగా ప్రతి మనిషి కి  soul-mate ఉంటుందా?
నేను ఇప్పటి వరకు చాల జంటలు చూసాను...
అందరూ soul-mate కనెక్ట్  అయ్యారా?అనేది తెలియదు..
అసలు ఒకమనిషి జీవితం లో  soul కి soul-mate కనెక్ట్ అవుతుందా?
నా లాంటి వాడికి అసలు  soul కి సరి పడే soul-mate ని ఎలా కనుక్కోవాలి??NEXT EPISODE

Saturday, December 13

10000 వీక్షకులు..రెండున్నర నెలలు...59 పోస్టులు

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

తెలుగు బ్లాగర్లందరికీ  తెలుగు బ్లాగుల దినోత్సవ  శుభాకాంక్షలు.Friday, December 12

ప్రేమ శాతం :ఆ రోజు నాకో చెల్లి పుట్టింది

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2   3  4   5  6


ఆ రోజు నాకో చెల్లి  పుట్టింది


నాకొక చెల్లి పుట్టిందని  తెలిసి ఆనందపడిపోయాను..ఈ విషయాన్ని సుబ్బు గాడితో చెప్పాలని వాడింటికి వెళ్ళాను...
ఆ తర్వాత...
నా బొమ్మలు తీసుకుంటుందని ...నా బొమ్మలతో ఆడుకుంటుందని...నేను ఇప్పుడు మా అక్క దగ్గర నుండి బొమ్మలు లాక్కుంటున్నట్లు నా బొమ్మలన్నీ తీసుకుంటుందని సుబ్బు వాళ్ళ అక్క నాతో చెప్పింది..
అంతే ఒక్కక్షణం లో నా ఆనందం ఆవిరి అయిపొయింది...
నాకు వెంటనే మా చెల్లి  పైన అసూయ కలిగింది...
అ తర్వాత ...
నేను హాస్పిటల్ కి వెళ్ళాను నాన్న గారితో...
అసలు నా బొమ్మలు ఎలాగా లాక్కుంటుంది..అలాంటివి ఏమైనా చేస్తే వెంటనే కొట్టాలి...
అనుకొన్నాను ..
అక్కడ ఊయలలో చిన్న పాప ను చూసాను ..నన్ను చూసి బలే గా నవ్వింది...
నేను వెంటనే వెళ్లి పాప తో ఆడుకున్నాను...చేతులు పట్టుకున్నాను ,నా వేలును గట్టిగా పట్టుకుంది...
ఇంటికి వెళ్ళాలనిపించలేదు...స్కూల్ కి ఎగ్గొట్ట వచ్చు ...ఇంకా ఎంచక్కా ఇక్కడే ఆడుకోవచ్చు ...
ఇంకా అంతే సుబ్బు వాళ్ళక్క అన్ని అబద్దాలు నాకు చెప్పినదని అర్ధమైంది...
మా అక్క నాకన్నా ముందే  ఎప్పుడో వచ్చింది ..ఇంకా చెల్లికి తన బొమ్మలు కూడ తెచ్చింది...చెల్లి అక్క వేలును కూడా పట్టుకుంది..

ప్చ్...నాకు వెంటనే నా బొమ్మలు అన్ని తెచ్చేసి నేనే మంచి మార్కులు తెచ్చుకోవాలని అనిపించింది...
వెంటనే ఇంటినుండి నా బొమ్మలు తేవాలని  అల్లరి చేసాను..
బొమ్మలు తెచ్చుకుందామని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్లి స్కూల్ కి పంపేసారు..
మల్లి సాయంత్రం వచ్చి చేల్లెతో ఆడుకున్నాను...
ఇక్కడేమో స్వార్ధం ప్రేమ రెండు దోబుచులాడుకున్నాయి...స్వార్ధం ..ప్రేమ...రెండు పోటి పెట్టుకున్నాయి...
మొదట స్వార్ధం పెరిగింది..(అసూయ రూపం లో)చివరకు ప్రేమ గెలిచింది(చెల్లె కోసం నా బొమ్మలు ఇవ్వాలనుకోవడం) అందుకే ప్రేమ శాతం ...పెరగ లేదు  అట్లే స్వార్ధం శాతం... కూడా పెరగలేదు
ఇవ్వడం లో కూడా ఆనందం ఉంటుందని తెలుసుకున్నాను...
మనం ప్రేమించినా ,ద్వేశించినా మన ఆనందం కోసమే చేస్తాము...
ప్రేమించినపుడు కలిగే ఆనందం ...త్రుప్తి రూపం లో ఉంటుంది
ద్వేశించినపుడు కలిగే ఆనందం ...పాపం రూపం లో ఉంటుంది..
మొత్తం మీద మన ఆనందం కోసమే  ప్రేమ ...మన ఆనందం కోసమే స్వార్ధం
                                                                                       NEXTPART
if you want notification..email me: srinosys1@gmail.com

Thursday, December 11

ప్రేమ శాతం :అలక The blackmail

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2 3 4 5

అలక అనేది మనలో స్వార్ధాన్ని పెంచే మరో గొప్ప ఆయుధం ...
చిన్నపుడు నేను అమ్మా నాన్న లతో జాతరకు వెళదామనుకున్నాము ...

అక్కడ నాకు ఒక జీప్ బొమ్మ చాలా చాలా నచ్చేసింది...ఇంకా వెళ్ళకముందే..
ఇంకా మనం ఊరుకుంటామా?...
జాతరకు వెళ్లేదే బొమ్మలకోసం..అందుకే ఇంట్లో ముందే జీప్ బొమ్మ కావాలి అని ఆర్డర్  పాస్ చేసేసాను...
ఇంకేముంది సరేలే కొందామని వాళ్ళు కూడా చూచాయి గా చెప్పేశారు...
ఇంకేం జాతరలో బొమ్మల షాప్ ల దగ్గరికేల్తే జీప్ బొమ్మ కనపడలేదు...
అన్ని bangels,stickers,లాంటివి కనిపిస్తున్నాయి...ఏంటా అని ఆలోచిస్తే ...
ప్చ్...నేను మా అమ్మ ,మా అక్క వాళ్ళ జట్టులో ఉన్నాను..
అందుకే  షాప్ లలో బొమ్మలకు బదులు గాజులు ,బొట్టుబిల్లలు కనబడుతున్నాయి..
వెంటనే నాన్న గారి జట్టులోకి వెళ్ళాను...
ఇప్పుడు నాకు కావలసిన బొమ్మల షాప్ కనబడింది...
అందులో నా కళ్ళు ఏ బొమ్మను వెతుకుతున్నాయో మీ అందరికి ముందే తెల్సు కదా...
అలా చూస్తుంటే నాకు కనిపించింది...కళ్ళు మైమరపు గొలిపే అందమైన బొమ్మ ...
అసలు నా కళ్ళను తిప్పుకోనీయకుండా నన్ను పూర్తిగా దానివైపే తిప్పెసుకున్నబొమ్మ...
అదేనండి ...రిమోట్ హెలికాప్టర్...

అదేంటి జీప్ కదా కొనుక్కోవాల్సింది ...మరి ఇప్పుడు ఇదేంటి అని డౌట్ మీకు అవసరం లేదు..
నిన్నటి నా ప్రపంచం లో జీప్ మాత్రమే ప్రయారిటి గా ఉండేది,ఎందుకంటే దాని పరిది చిన్నది అంతే ..దానికి తెలియదు జీపు ను తల దన్నే బొమ్మలు ఉంటాయని...
ఇప్పుడు ఆ ప్రపంచం లోకి వచ్చాను ...అందుకే నా ఇష్టం జీపు నుండి హెలికాప్టర్ కి షిఫ్ట్ అయ్యింది....
ఇలా ఆలోచనలో నేను ఉన్నంత లోనే మా నాన్న గారు నాకు జీప్ కొనేసారు...
నాకు జీప్ ఇవ్వబోయారు ...నా కళ్ళ లో నా ఆనందాన్ని చూడాలనే ఆశతో ...
అంతే నా మనసు మొత్తం కకా వికలమయ్యింది...ఇప్పుడు ఎలాగ? పరిస్థితి నా చేతుల్లో లేదే...
అసలు ముందు జీప్ కావాలి అని చెప్పాల్సింది కాదె...?
పక్కింటి సుబ్బుగా ఎందుకురా నాకు జీప్ చూపించావు...దాని మీద ఆశలు పెంచావు...
ఇప్పుడు హెలికాప్టర్ ఎలాగరా?కొనుక్కోనేది...?
ఇప్పటికే స్వార్ధం లో మూడు  మెట్లు ఎక్కిన నేను నాలుగో మెట్టు నాకు నేనుగా ఎక్కలేనా?
ఎక్కగలను...
అందుకే ...ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా జీప్ బొమ్మ వద్దు అనకూడదు...ఎందుకంటే నిన్న ఆర్డర్ చేసాను కదా...
జీప్ తో పాటు హెలికాప్టర్ కూడాకావాలి,అని అలగాలి ...ఇదే సరైన సమయం ...ఇప్పుడు ఈ అవకాశాన్ని వృధా చేసుకోరాదు...అనుకోని ,నాకు హెలికాప్టర్ బొమ్మ కూడా కావాలి అని అడగడం ...
నాన్న గారు నో అని చెప్పడం ....అలాగైతే నేను భోజనం చెయ్యను అని చెప్పెయ్యడం ...తో

పాటు వాళ్ళతో అన్ని మూసుకొని ఇంటికి రావడం జరిగి పోయింది....
 ఎందుకంటే అక్కడ తాగేవి ,తినేవి ఏవి వాళ్ళను అడగలేదు ...ఎందుకంటే నేను అలిగాను కదా ...ఎలా అడుగుతాము...ఈ చిన్న చిన్న వాటికోసం కక్కుర్తి పడితే హెలికాప్టర్ రాదు కదా?
నైట్ 9 అయ్యింది ,అందరు భోజనాల దగ్గరికి వచ్చారు ...నా కోసం ఒక కేక వేసారు ...
దానికోసమే వెయిట్ చేసే నేను నిండా ముసుగు తన్ని పడుకున్నట్టు నటిస్తున్నాను..
చెల్లి వచ్చి అన్నా ..అన్నం తినడానికి రా అంది..
 అక్క వచ్చింది..అడిగింది...జవాబు ఇవ్వలేదు ..ఎందుకంటే వీళ్ళతో పని జరగదు..
అనవసరంగా వీళ్ళతో టైం అండ్ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం
చివరగా అమ్మ వచ్చింది...అడిగింది...నేను తినను నాకు హెలికాప్టర్ కొనలేదు కదా..అని చెప్పాను..
తర్వాత కొంటారు లే ...ఇప్పుడైతే రా రా అని అడిగింది...నేను లేదు అన్నాను...
ఇదే విషయం నాన్న గారి దగ్గరికి తీసుకెళ్ళింది...
అక్కడి నుండి నో వాడికి గారాభం ఎక్కువయ్యింది...అనే జవాబు...వాడికి ఆకలైతే వాడె వస్తాడు...అని చెప్పడం ..
వాళ్ళు తినడం జరిగింది...
బిర్యాని తెచ్చారు...తినడానికి...
సరేలే ఇంకోసారి అమ్మ వస్తే తిందాం అనుకున్నాను...
కాని bed సర్దేస్తూ హాయిగా పడుకుంటున్నారు
సరే అక్కయ్య ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా ..తనయినా అడుగుతుంది అపుడు తిందాం అనుకున్నాను...
కాని అక్కయ్య అక్కడ చదువుకుంటుంది...
సరే ఎలాగైనా చెల్లె నాతో పాటే కదా పడుకోనేది కచితంగా అన్నం తిను అన్నా అంటుంది..అపుడు తిందాం అనుకున్నాను...కాని అమ్మ తో సీరియల్ చూస్తుంది..రాత్రి 10కి సీరియల్ 10 -30 వరకు ఆగాలా?
సరేలే అనుకున్నాను...
మరో పది నిమిషాల్లో అమ్మ ఒడిలోనే నిదుర పోయింది...
అయ్యో నన్ను అడిగే వాళ్ళు లేరా?...కడుపులో ఎలుకలు తిరుగుతూ ...అహం అడ్డు వస్తూ...తినాలని ఉన్న అడగలేక ...ఉంటున్న సమయం లో సీరియల్ బ్రేక్ వచ్చింది...అమ్మ చెల్లేని నా పక్కన పడుకోబెట్టేస్తూ..
చిన్నా! నీ కోసం నాన్న గారు బిర్యాని తెచ్చారు కదా..!కొంచెం తినరా అని అడిగింది...
exact గా ఇలాంటి బుజ్జగింపు కోసమే చూసే నేను ఎగిరి గంతేసి వెళ్లి తినాలి కదా...?మల్లి హెలికాప్టర్ గుర్తొచ్చింది..
అటు తిరిగి పడుకొన్నాను...ఇంకేమి మాటలు వినపడడం లేదు..
అయ్యో అమ్మ మల్లి  టీవీ దగ్గరికి వెళ్ళిందా?మళ్లీ మరో పావుగంటా?అనుకునేంత లోపే మళ్లీ అడిగింది..
మరి ఇప్పటి వరకు ఈ సైలెంట్ ఏమిటా అనుకుంటున్నారు కదా?
చెల్లెకి దుప్పటి సర్దింది...అందుకే కొన్ని నిమిషాలు మాట్లాడలేదు...
వెంటనే నా కోరిక ను నెక్స్ట్ టైం జాతరలోకొనడం కోసం అగ్రిమెంట్ జరిపి ...కొన్ని షరతులు పెట్టడం జరిగింది...
అవేంటంటే....
నాకు రేపు కొన్ని చాక్లెట్స్ కొనివ్వాలి ,ఇప్పుడు అన్నం తినిపించాలి...
కోరికలు ఒప్పుకోవడం భోజనం చెయ్యడం ..పడుకోవడం ..జరిగిపోయింది
నెక్స్ట్ టైం జాతరకోసం ఎదురు చూస్తూ ఉన్నాను..కేవలం హెలికాప్టర్ నే టార్గెట్ గా పెట్టుకోకూడదు...
అక్కడికి వెళ్లిన తర్వాత హెలికాప్టర్ కంటే మంచి బొమ్మలు ఉండొచ్చు కదా!అందుకే చూసి కొనుక్కోవాలి...
ఇక్కడ నేను పూర్తిగా స్వార్ధ పరుని గా మారడానికి కావలసిన తెలివి తేటలు పెంపొందిన్చుకున్నాను..
ఎందుకంటే ఒకే బొమ్మకు కనెక్ట్ కాకపోవడం ,నా స్వార్ధానికి తగినట్టు పరిస్థితులకు అనుగుణంగా నా కోరికలకు ప్రతిస్పందించడం లాంటి వన్నిటి తో పాటు,
ప్రేమ 46శాతం..స్వార్ధం 54శాతం తో....READMORE

Monday, December 8

ప్రేమశాతం:నా వెనక మా అమ్మ ఉంది!

కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...
పాత  పోస్ట్ లు 1  2 3 4

స్వార్ధం పెరిగిన నేను
 ఒక రోజు మా ఇంట్లో మా అక్కయ్య వస్తువులతో ఆడుకొంటుంది
అప్పుడు  నా కన్ను మా అక్క ఆడుకొనే వస్తువుల మీద పడింది...
దాన్ని ఇమ్మని అడిగాను ...
ఇవ్వలేదు...
నా స్వార్ధానికి కోపం తోడై ఆ వస్తువు పట్ల ఆశ ఇంకా పెరిగి పోయింది
వెంటంటే మా అక్క దగ్గరి వస్తువు లాక్కోవడానికి ప్రయత్నించాను...
కాని తనేమో నాకన్నా పెద్దదాయే....
 ఒకటి నన్ను కొట్టేసి నన్ను నెట్టేసింది...
వస్తువు రాక పోగా..దెబ్బలు కూడా తగిలాయి..
మళ్ళి ఆ కదనరంగానికి వెళ్ళలేని స్థితి..
ఎందుకంటే నా బలం ఎందుకు పనికి రాదనీ తెల్సి పోయింది... 
ఇప్పుడు కొత్తగా అవమాన భారం కూడా కొతగా నా స్వార్ధానికి జతకూడింది...
నా నిస్సహాయత ...కోపం ...స్వార్ధం ..ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పంతం ,అవమాన భారం
అయ్యా బాబోయ్ చిన్న పిల్లవాడిని నాకు ఇన్ని అవలక్షనాలు ఉన్నాయా..?
ఏమో?
ఎవడికి తెల్సు ?ఇప్పుడైతే ఆలోచిస్తే 
ఆ దుష్టలక్షణాలు కలిగి ఉండడం వల్లే అలా లాక్కోవడానికి ప్రయత్నించాను..!అని అనుమానం
 మరెలా?
అసలు నేనా బొమ్మను ఏల చూడవలె?...చూసితినిపో?
మరి ఏల ఆ బొమ్మ నాకు కావాలనిపించెను?...అనిపించెను పో?
మరి ఏల వెళ్లి బొమ్మ ఇమ్మని అడగవలె?....అడిగితిని పో..?
మరి ఏల నాకు బొమ్మ ఇవ్వనని చెప్పవలె?...చెప్పినది పో?
మరి ఏల నేను లాక్కోవడానికి ప్రయత్నించవలె?...ప్రయత్నించితిని పో?
మరి ఏల నన్ను మా అక్క కొట్టవలె ...?
ఎటుల ?...ఎటుల?
హా ఎంత  అవమానం ?ఎంత అవమానం?

అని ఒక "దానవీరశూరకర్ణ "లాంటి సినిమా వేసుకున్ననేమో తెలీదు గాని అంత పని చేసి ఉండి ఉంటాను...

శత్రువు మన కన్నా బలవంతుడైనపుడు ....అతన్ని ఎదుర్కోవాలంటే అతనికన్నా ఎక్కువ బలవంతులను మన జట్టులో కూడా గట్టుకోవాలి 
అనే చాణక్యుడి నీతిని చదవకముందే, అప్పుడే ఒంట బట్టించుకొన్నానేమో? 

సరిగ్గా అప్పుడే ఒక ఐడియా వచ్చింది...
మా అక్క ఎవరి మాట వింటుందో..వాళ్ళతో చెప్పిస్తే.. ఆ వస్తువు ఏల నా వద్దకు రాదు...

ఆ ఐడియా నే ....

 "నా వెనక మా అమ్మ ఉంది!"
అమ్మను ప్రయోగించవలె..ప్రయోగించిన క్షణాల్లోనే బొమ్మ నా వద్దకు వచ్చి తీరుతుంది,వస్తుంది ,వచ్చింది...

అలాగా నాకేదైనా వస్తువు కావాలంటే మా అమ్మను ప్రయోగించి వస్తువులను ఇప్పించుకొనే వాణ్ని..

ఈ విధంగా స్వార్ధం మా స్కూల్ నుండి...మా ఇంటి పరిసరాలకు ...అటునుండి ..మా ఇంటికి వచ్చింది...


ఇలాగ నాకు కావలసినవి లాక్కోగలిగాను...

ఈ రకంగా నాకు కావలసినవిఎవ్వరి దగ్గర నుండి అయినా సాధించుకోవచ్చనే అభిప్రాయం ఏర్పడింది...

అప్పటి నుండి నేను ఇతరుల మాటలు వినను ,వాళ్ళ అవసరాలు పట్టవు

అలాగా నేను ఇతరుల పైన ఆధారపడే వాడిగా తయారయ్యాను...

భోజనం తినడం నేర్చుకున్నాను,తప్పా స్వయంగా తయారు చేసుకొనేస్థితి లో నేను లేను...

వాస్తవంగా ఆలోచిస్తే   మా అక్కని మా అమ్మ నొప్పించింది...నాకు ఇప్పించింది...

అలాగా దురభిమానంతో పెత్తనం చెలాయించే...వానిగా తయారు అయ్యాను...

ప్రేమ 47 స్వార్ధం53 గా మారింది...

కాని ఇక్కడ మా అమ్మ...మా అక్క నుండి ఇప్పించకుండా ఎం చేస్తే బాగుండేదో చెప్పగలరా?

జవాబును  మీ కామెంట్స్ రూపం లో పెట్ట గలరు

తర్వాత రేపు నా జవాబు ను ఇదే పోస్ట్ లో పెట్టగలను,రేపు ఒక సారి చూడగలరు ...

కామెంట్ లో నా జవాబు చూడగలరు READ MORE
Saturday, December 6

నాకు పవన్ కళ్యాణ్ కి ఒకటే తేడా ! ఒక ఆడ్

21:47 Posted by who am i No comments
ఇది advertisement మాత్రమే.....

నా blog సీరియల్ లో ఆడ్ ఇస్తే ఎలాగుంటుంది అనే ఐడియా వచ్చింది....

సాదారణంగా సీరియల్ చూడడం వల్ల ఆడ్ చూస్తారు...

కాని నేను ఆడ్ చూపించడం వల్ల నా blog సీరియల్ చూపిద్దామనుకున్నాను...

ఎందుకంటే నా బ్లాగ్ లో ఒక సీరియల్ మొదలైందని ...ఆ విషయం జనాలకు తెలపాలని...

అదే " ప్రేమశాతం "

జనాలు నా బ్లాగ్ లో కి ఎంటర్ అయ్యిందుకు  ....

ఒక ఆడ్ కావాలి అనుకున్నాను ...అదే ఈ ఆడ్...

సరే ఆడ్ విషయానికి వస్తే ....

ఒక చిన్న పిల్లవాడు ముద్దు ముద్దు గా ఇలా ఒక dialog చెప్తాడు!

చూడప్ప సిద్దప్ప ! నాకు పవన్ కళ్యాణ్ కి ఒకటే తేడా! 

తను సినిమా లో నటిస్తాడు ,నేను నటించను

మిగతాదంతా సేమ్ టు సేమ్


(త్వరలో venkatesh మరియు pawan kalyan నటించిన గోపాల గోపాల మూవీ మీ అభిమాన ధియేటర్ లలో ......, వస్తున్న సందర్భంగా)చిన్న పిల్లలు కూడా సినిమా  హీరోలను అనుకరిస్తూ ఉంటారు ,వాళ్ళు ఇలాంటి డైలాగ్లు చెప్తుంటే బుద్దు బుద్దు గా

బలే గా ముద్దు వస్తూ ఉంటారు  ....కదా

మీ కోసం ఒక జోక్ :

 
 సింహం :నేను  పవన్ కళ్యాణ్ లాంటోడిని,తనకి నాకు ఒకటే తేడా !

నేను గడ్డం గీసుకోను ,తను గీసుకుంటాడు ,మిగతాదంతా

same టు same

ఒక టీవీ కామెడీ షో లో వచ్చిన జోక్  బాగుందా ....MY SERIAL

Friday, December 5

ప్రేమ శాతం :అసలు నా జీవితం లో ప్రేమ కలిగిన రోజే లేదా?


 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

 పోస్ట్ 1  పోస్ట్ 2 పోస్ట్ 3

అసలు నాలో ప్రేమే లేదా ?ఎంత సేపు స్వార్ధ పరున్నేనా?
అసలు నా జీవితం లో ప్రేమ కలిగిన రోజే లేదా?

నేను ఒక రోజు మా నాన్న గారితో గుడికి వెళ్ళడం జరిగింది....
మా నాన్న గారు తన దగ్గరున్నకొన్ని చిల్లర డబ్బులు కొన్ని ఇచ్చాడు ....
వాటిని అక్కడ  గుడి దగ్గరి బిక్షగాల్లకు ఇవ్వమని చెప్పాడు...
పాపం కదా...వాళ్ళకు కనీసం తినడానికి తిండి కూడా సరిగా దొరకడం లేదు కదా...
ఇక్కడైతే ఆలోచించలేదు వాళ్ళకు డబులిస్తే వాళ్ళు నాకేం ఇస్తారు రిటర్న్ అని...
ఇప్పుడైతే అనుకొంటాను వాళ్ళు ఆశీర్వదిస్తారు అనే కారణం వల్ల వాళ్ళకు డబ్బులిస్తానేమో వాళ్ళకు
అలా ఆలోచిస్తే వచ్చిన పోస్టే   సంస్కారవంతమైన దీపావళి
అందులో ఆ రకంగా ప్రార్ధించాను.....

ఇలా గా నా ప్రేమ శాతాన్ని  48 నుండి 49 కి పెంచుకున్నాను.....నేను మంచి బాలుడినే కదా

కాని ఆ చిన్న సంఘటన నా లో కూడా ప్రేమ ఉందన్న సంగతిని తట్టి లేపింది....

అందుకేనేమో కనీసం మంచి గా  ఆలోచించే శక్తి నాకు వచ్చి ఉంటుందేమో ?

ప్రేమ అనేది ప్రతి మనిషి లో ఉంటుందనేది నా నమ్మకం...

అంటే నాలో కూడా ఉంటుంది...ఉంది ..

కాని దాన్ని నా శరీరాన్ని పెంచి పోషించినట్లు, నా లో ఉన్న  ప్రేమను పోషించడం లేదు...


మరి ప్రేమను పోషించడం ఎలా?

ప్రేమను పెంచుకోవడం ఎలా?

స్వార్ధం అంటే కలుపు మొక్క లాంటిది ...

అది ఎలాగైనా పెరిగిపోతుంది...

కాని ప్రేమ మనం పెంచుకొనే మొక్క...

దానికి ఏమి కావాలి?ఎలా పెరుగుతుంది?

దానికి ఏమైనా పద్ధతి ఉందా?

మీకు తెలిస్తే నాకు చెప్పడానికేం మొహమాట పడకండి...

ఎందుకంటే నేను ఇక్కడ మీ అమూల్యమైన అభిప్రాయాల కోసం ....నాలో ప్రేమ శాతాన్ని పెంచుకోవడం కోసం

ఎదురు చూస్తున్నాను...READMORE


Wednesday, December 3

ప్రేమ శాతం-బూరె చెప్పిన సత్యం


 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

link to పోస్ట్ 1                       link to  పోస్ట్ 2


                    ఒక రోజు మా అత్త వాళ్ళింటి వద్దకు నేను మా స్నేహితుడితొ కలిసి ఆడుకోవడానికి వెళ్ళాను...
ఆరు బయట ఆడుకొంటుంటే ...ఆ రోజు మా అత్తయ్య నన్ను మాత్రమే లోపలికి పిలిచి బూరె ను ఇంటి లోపలే తినిపించింది....నా స్నేహితున్ని పిలుద్దాం అంటే ,వద్దు నీకోసం మాత్రమే ఒకటి ఉంచాను....అది ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని చెప్పింది....నేనేమో ఒక్కటే కదా మా స్నేహితుడికి ఇవ్వలేము కాబట్టి నేనొక్కడినే తినొచ్చు...
అనేసి తిన్నాను....బయటికి వెళ్లి ఏమి జరగనట్టు మా స్నేహితుడితో ఆడుకున్నాను,
మరొక విషయం ఏమిటంటే నాకు అక్కడ ఇంకా బూరెలు కనపడ్డా కాని ,మా అత్త చెప్పిన "ఒకటి మాత్రమే ఉంది"
అనే అబద్దాన్ని నా మనసును మోసం చేసుకొని ఆత్మ సంతృప్తి కలిగించుకొన్నాను,


ఇక్కడ నా మనసును నేనే మోసం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ?
జవాబు:నేను మంచి వాడిని అని నాకు ఒక బ్రాండ్ పెట్టుకొన్నాను....కనుక నేను మా స్నేహితునికి  ఇవ్వకుండా ఆ బూరె ను తిన కూడదు, కానీ తిన్నాను ...అంటే నేను మంచి వాడిని కాను...దాన్ని నేను ఒప్పుకోలేను...ఎందుకంటే పక్కవాళ్ళు నేను మంచివాన్ని కాదంటేనే ఒప్పుకోలేను ?అలాంటిది నన్ను నేను చెడ్డ వాడు అని నన్ను నేను అనుకుంటే ఇంకేమన్నా ఉందా?మరప్పుడు నేను ఎం చెయ్యాలి ?మా స్నేహితునికి ఇవ్వాలని నాకు లేదు?అందుకోసమే పలాయన మార్గాన్ని ఎంచుకొన్నాను...అదేమిటంటే అక్కడ ఒక్క బూరె మాత్రమే ఉన్నది అనే అబద్దాన్ని నేను నమ్మడం ఒక్కటే దారి,అందుకే అబద్దాన్ని నాకు నేను చెప్పుకోవడానికి మా అత్త నాకు హెల్ప్ చేసింది...ఆ రకంగా నా మనసును అంత విజయ వంతంగా మోసం చేసుకొన్నాను ...ఎంతగా మోసం చేసుకున్నాను అంటే ,ఆ తర్వాత నేను నార్మల్ గా మల్లి స్నేహితుడితో అడుకోగాలిగాను...

ఈ రకంగా నాలోని స్వార్ధం 52పెరిగి ప్రేమ  48గా తగ్గిపోయింది...

ఈ పోస్ట్ లో నేను తెలుస్కున్నది  ఏమిటంటే నేను మా స్నేహితున్ని మోసం చేసాను అని అనుకున్నాను...
కాని మా స్నేహితున్ని మోసం చేసే ముందు నన్ను నేను మోసం చేసుకున్నాను...

అందరు (నా లాగ మంచి వాడు అనే ముద్ర వేసుకున్నవాళ్ళు)ఇలా మొదటగా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారనుకుంటాను...అలాగా వాళ్ళు ఆత్మ సంతృప్తి లో ఇరుక్కుంటారు!

సాదారణంగా నా లాగే మంచివాడు గా కనబడే వాళ్ళే ఎక్కువగా ఉండి ఉంటారు ?

మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి నాలాగే మీరు మీ మనసుని మోసం చేసుకో కూడదు?

అనేది నా ఈ పోస్ట్ ఉద్దేశ్యం ...ప్రేమ శాతం లో ప్రేమ ఎందుకు తగ్గుతుంది ?అంటే మనం ప్రేమ అంటే ఏమిటో

తెలుసుకోక పోవడమే?అసలు ప్రేమ అంటే ఏమిటి ?లాంటి విషయాలను వచ్చే పోస్ట్ ల లో చర్చిద్దాము....

అంత వరకు ఆత్మ సంతృప్తిలో ఇరుక్కోకండి...ఉంటాను....READ MORE

Monday, December 1

ప్రేమ శాతం -"కాకి ఎత్తుకెళ్ళింది...!"కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు, ,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...

                           నిన్నటిపోస్ట్ :   అపుడు   ప్రేమ51- స్వార్ధం 49 గా మారిపోయింది..!

పోస్ట్ 2:
         ప్రేమించడం చిన్నపిల్లల్లో ఉంటుంది - కాని మనమే చిన్న పిల్లల్లో ప్రేమ ను చంపేస్తాము

                 అలా నా ప్రేమ ను స్వార్ధం  డామినేట్ చేసి జీవితం లో ప్రాక్టికల్ గా బ్రతకడానికి బీజం వేసింది..
అప్పటి నుంచి నేను ప్రతి మనిషి నుండి నాకేంటి ?అనే ప్రశ్న ప్రతి అంశంలో వేసుకోనేవాడిని...

కొన్నాళ్ళ తర్వాత  నాలో ప్రేమ శాతాన్ని తగ్గించిన ఆయుధం  "కాకి ఎత్తుకెళ్ళింది...!"

మీకు తెలుసా ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది....

             నా దగ్గర ఉన్న వస్తువు మా అమ్మ దాచేయ్యాలని  తీసుకొని నేను ఆ వస్తువు ఏది అని అడిగితే మా అమ్మ "కాకి ఎత్తుకెళ్ళింది...!"అని చెప్తూ ఉండేది...
కాని కొన్ని రోజులకు "కాకి ఎత్తుకెళ్ళింది...!"లో కాకి రహస్యం తెలిసిపోయింది....

ఒక రోజు మా అమ్మ లడ్డులు చేసింది ....
అపుడు నేను కొన్ని మా అమ్మకి తెలియకుండా లడ్డూలు తీసుకోని మా ఫ్రెండ్స్ తొ ఎంజాయ్ చేసాము...
ఇంటికి వచ్చాక మా అమ్మ లడ్డూలు ఏవిరా ?అని అడిగింది..తెలిసిపోద్దిగా ...కొన్నిలడ్డూలు మిస్అయితే?
నేను అప్పుడు ఏమి చెప్పానో తెల్సా?....

"కాకి ఎత్తుకెళ్ళింది...!"నేను చూసానమ్మా....! అని గట్టిగా నొక్కి వక్కానించాను...
ప్చ్ కాని ఎం లాభం?
మా అమ్మ నా లాగ చిన్న పిల్ల కాదు గదా?.వెంటనే....దొంగ ను కనుక్కుంది...?
ఇక్కడ నా బండారం బయట పడింది....బడితే పూజ పూర్తయ్యింది..!
ఆతర్వాత కొన్ని రోజులకు...
మా చెల్లె వస్తువు ఏదైనా నాకు కావాలి అనుకుంటే నేను కూడా లాక్కునే వాడిని....
మా చెల్లె తన వస్తువు ఏది అని నన్ను అడిగితే ?
నేను చెప్పే మాట "కాకి ఎత్తుకెళ్ళింది...!"
ఇక్కడ వర్కౌట్ అయ్యింది ....ఎందుకంటే చెల్లె చిన్న పిల్ల కదా?
అప్పుడు నేను ఒక సూత్రాన్ని కనుక్కున్నాను....

మన కంటే చిన్న పిల్లల దగ్గరినుండి మాత్రమే వస్తువులను "కాకి ఎత్తుకెళ్ళుతుంది...!"

ఈ విదంగా "కాకి ఎత్తుకెళ్ళిన" ప్రతి సారి నేను లౌక్యం గా తప్పించుకోవడం జరిగింది...

ఇప్పుడు నాలోని స్వార్ధం 51 నుండి 52వరకు పెరగలేదు....

ఎందుకంటే ఇది కేవలం నా లోని స్వార్ధం లో వందో వంతు మాత్రమే...

"ప్రేమ కూడా స్వార్ధానికి ఒక పర్యాయపదం గా మారిపోయింది...

మన పెద్ద వాళ్ళు గోరు ముద్దలతో స్వార్ధాన్ని ఎక్కిస్తారు, ,

ఒక మాతృమూర్తి చిన్న పిల్లవాడికి అన్నం తినిపిస్తూ,

నువ్వు తినకపోతే , ఈ ముద్ద  "కాకి ఎత్తుకెళ్తుంది...!"(ఇంకెవరికో పెడతాను)

అని బెదిరిస్తూ స్వార్ధపు బీజాలను చిన్నారి పసి మనుసులో ఎక్కిస్తే ,పెద్దవాడైన తర్వాత తను పక్కోడి ముద్దకోసం 

ఎందుకు వెంపర్లాడడు?"

కాని స్వార్ధమే ప్రేమ ని డామినేట్ చేసింది.........మళ్ళీ...ఈ రోజు కూడా

ప్రేమ లో ఓడిపోయాను....రేపు మళ్ళి కలుద్దాం.....READ MORE

.

Saturday, November 29

ప్రేమ శాతం-ఎందుకంటే ప్రేమించడం ,ద్వేషించడం అంత ఈజీ కాదు...ప్రేమ శాతం:serial part 2
 కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు....
అసలు ఒక మనిషి పుట్టినపుడు అతని లో ప్రేమ శాతం ఎంతుంటుంది...

అతను పెరిగి పెద్ద వాడయిన కొలది అది త్రగ్గుతుందా?లేక పెరుగు తుందా?

పెరిగితే నష్టం లేదు...తగ్గితేనే ప్రమాదం...అంటుందీ సమాజం...

కాని మరి సమాజం లో ఉన్న చాలా మంది ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ద్వేషమే ...ప్రేమ శాతాన్ని

డామినేట్ చేస్తుంది..

అందరికీ తెలుసు ప్రేమ శాతాన్ని పెంచుకొంటే బాగుంటుందని...అందరు ప్రేమే సత్యం ప్రేమే నిత్యం అంటారు....

అయినా ప్రేమించే ఉద్దేశ్యం ఉండదు ....ఎందుకంటే ప్రేమించడం ,ద్వేషించడం అంత ఈజీ కాదు...

ప్రేమించడం అంటే ఎన్నో త్యాగాలు చెయ్యాలి ....మన మనసుని చాలా చాలా కష్ట పెట్టాలి...

అయితే పెంచుకోవడం ఎలా?

మొదటగా నేను అనుకున్నాను 50-50 (ప్రేమ- స్వార్ధం) ఉన్నాయి అని

ఈ శాతం నాకు ఉహ తెలిసే వరకు ఉండి ఉంటుంది..

నా పక్కన కూర్చున్న అబ్బాయి కి బలపం లేకపోతే నేను ఇచ్చాను,ఏమీ ఆశించకుండా?

లంచ్ టైం లో  మా అన్న వచ్చి తిట్టాడు నీకు అంత పెద్ద బలపం ఇచ్చాను అప్పుడే అయిపోయిందా అని?

అపుడు నా పక్కనే కూర్చున్న మరొక అమ్మాయి చెప్పింది.. మా అన్నయ్య కి ,నేను వేరొక అబ్బాయికి నా బలపం

కొంత ఇచ్చాను అని,


అంతే మా అన్నయ్య నన్ను తిట్టేసి నీకు వాడు ఎప్పుడైనా బలపం ఇచ్చాడా?నువ్వెందుకు ఇచ్చావు అని ..!

అపుడు   ప్రేమ51- స్వార్ధం 49 గా మారిపోయింది..!

ఆతర్వాత నుండి నేనేవరికైనా నా వస్తువు ఇవ్వాలి అంటే వాడు నాకు గతం లో ఏమైనా ఇచ్చాడా? అని అలోచించి

వాడికి సహాయం చేసేవాడిని...!

ఈ రకంగా నేను స్వార్ధం లో తొలిమెట్టును ఎక్కాను....రేపు మల్లి కలుద్దాం...

మీ అభిప్రాయలు తప్పక తెలియ చేయగలరు.... READ MORE

ప్రేమ శాతం-నా లో ప్రేమ ఎంత ?కథ  కథనం హీరో :నేనే, హీరొయిన్:ఇంకా ఎంటర్ కాలేదు,ఇతర పాత్రలు:సమాజం లో నాచుట్టూఉండే మనుషులు...ఒక మనిషి పుట్టినపుడు తనలో ఎంత శాతం ప్రేమ ఉంటుంది ,ఎంత శాతం ద్వేషం ఉంటుంది?ఇప్పుడు నాలో ఎంత

శాతం ప్రేమ ఉంది ? ఎంత శాతం ద్వేషం ఉంది?అసలు మనిషి లో ప్రేమ శాతం లేదా ద్వేష శాతం త్రగ్గడానికి కారణం 

ఏమిటి? అని ఒక రోజు నాకు నేనే ప్రశ్నలు వేసుకున్నాను?

అపుడు మరిన్ని ప్రశ్నలు ఉదయించాయి..
             
               ప్రేమ శాతం ఎక్కువుంటే ఏమౌతుంది...ద్వేష శాతం ఎక్కువుంటే ఏమౌతుంది..?

                అది మనకు  నష్టమా?లేదా మనతో ఉండే వాళ్ళకు నష్టమా?సమాజానికి నష్టమా?

ఆ ఆలోచన లోంచి పుట్టినదే ఈ ప్రేమ శాతం % of love....my life serial

నా చిన్నప్పటి నుండి ప్రేమ శాతాన్ని నేను ఇక్కడ అవిష్కరించదలచుకున్నాను

The Tabula Rasa concept ప్రకారం మనిషి పుట్టి స్కూల్ కి వచ్చే వరకు ...అతను ఒక తెల్లని రాయబడని 
కాగితం లాంటి వాడు ..అంటే అతనికి ఎమీ తెలియదు ....కాని పిల్లవాడు అప్పటికే చాల నేర్చుకుంటాడు
అని తర్వాత మనో శాస్త్ర వెత్తలు చెప్పడం జరిగింది...

నేనుకూడా మనిషిలో ప్రేమ శాతం పుట్టినపుడు 100%ఉంటుందని అనకుండా , 50-50 (ప్రేమ- స్వార్ధం) ఉన్నాయి అని నా సీరియల్ concept మొదలు అవుతుంది... రేపటి  నుండి మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది,తప్పక మీ అభిప్రాయాలు నాతో పంచుకోగలరు...

నేనొక్కడినే ప్రేమశాతాన్ని పెంచుకోవడం ఎందుకు ?నాతో పాటు ఎవరికైనా సహాయం చేయవచ్చు కదా?

అసలు ప్రేమ శాతాన్ని పెంచుకోవడం పట్ల ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలి ....కనీసం ఒక్కరైనా ఒక్క

శాతమైన వారిలోని ప్రేమను కనుక్కోగలిగితే

ఈ బ్లాగ్ సార్ధకత చెందినట్లే....అని బ్లాగ్ స్టార్ట్ చేసాను...

మరి కొత్త బ్లాగ్ కి అప్పుడే జనాలు చూడరు కదా ...అందుకే ఒక 10000 వీక్షకులు పెరిగిన తర్వాత serial స్టార్ట్

చేద్దామనుకున్నాను,50 పోస్ట్ లు 8500 viewrs సరేలే అని నా లైఫ్ సీరియల్ స్టార్ట్ చేసాను...నా నుండి డైలీ

సీరియల్ గా ఎక్సెపెక్ట్ చెయ్యకండి,కాని డైలీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను....

మీరు అభిమానిస్తారని ...మీ అభిమాని

                                                                                                                           -శ్రీనివాస్